RRR: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప్రచారం.. నిజమెంత?

సినిమా అంటే ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ అంటే ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్.. ఇదీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల టాక్. ఈ సినిమా కోసం కోట్లాది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప్రచారం.. నిజమెంత?

Rrr

RRR: సినిమా అంటే ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ అంటే ఇండియన్ క్రేజీ మల్టీస్టారర్.. ఇదీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల టాక్. ఈ సినిమా కోసం కోట్లాది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు రానున్న ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రమోషన్ల మోతెక్కిస్తున్నారు యూనిట్. అయితే గత కొంతకాలంగా సినిమా పరిశ్రమను వేధిస్తున్న కరోనా భూతం మళ్లీ పట్టుకున్నట్టు కనిపిస్తుంది. థర్డ్ వేవ్ అననీ.. ఓమిక్రాన్ అననీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Akshay Kumar: టార్గెట్ 2 వేల కోట్లు.. వచ్చే ఏడాది అక్కీ ప్లానింగ్ అదిరిపోద్ది!

విజృంభిస్తున్న కరోనా దెబ్బతో ఇప్పటికే ఆల్రెడీ మహారాష్ట్ర లో నైట్ కర్ఫ్యూ విధించారు. థియేటర్లలో కూడా యాభై శాతం సీటింగ్ కు కుదించారు. ఇదే బాటలో మన దక్షిణాదిలో కూడా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా నిబంధనలు పెట్టే అవకాశం ఉందని కూడా బలంగా వినిపిస్తుంది.ప్రస్తుతం దేశంలో మళ్లీ మారుతున్న పరిస్థితులు రీత్యా ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి వాయిదా పడనుందనే టాక్ నడుస్తుంది. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ ప్రకటన అనంతరం ఈ టాక్ కాస్త వైరల్ అవుతుంది.

RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

ఒకరకంగా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పై కరోనా విజృంభణ ఇలానే ఉంటే వసూళ్ళపై బాగా ప్రభావం చూపడం గ్యారెంటీ. ఇక, సినిమా విడుదల వాయిదా మాత్రం నిజం కాదని తెలుస్తుంది. వాయిదా వేసే ఆలోచన లేదని.. అందుకే ప్రమోషన్లు ఆపడం లేదని విశ్లేషకుల మాట. ఇప్పటికే ప్రమోషన్ల కోసం ఆర్ఆర్ఆర్ భారీ ఖర్చు చేసింది. మరో వారం రోజుల పాటు ఇదే స్థాయిలో ప్రమోషన్ల కోసం ఖర్చు చేయనుంది. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇది వాయిదా పడే ఛాన్స్ లేదని చెప్తున్నారు.