Akshay Kumar: టార్గెట్ 2 వేల కోట్లు.. వచ్చే ఏడాది అక్కీ ప్లానింగ్ అదిరిపోద్ది!

నేను ఒక్కడిని ఒక వైపు.. మిగతా హీరోలంతా ఒక వైపు అంటున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ సంవత్సరం బాలీవుడ్ లో 200 కోట్ల కలెక్షన్లకు పైగా బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన..

Akshay Kumar: టార్గెట్ 2 వేల కోట్లు.. వచ్చే ఏడాది అక్కీ ప్లానింగ్ అదిరిపోద్ది!

Akshay Kumar

Akshay Kumar: నేను ఒక్కడిని ఒక వైపు.. మిగతా హీరోలంతా ఒక వైపు అంటున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ సంవత్సరం బాలీవుడ్ లో 200 కోట్ల కలెక్షన్లకు పైగా బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన అక్షయ్ కుమార్.. నెక్ట్స్ ఇయర్ ఏకంగా 2 వేల కోట్ల సినిమాల మార్కెట్ తో రెడీ అవుతున్నారు. మరి అక్షయ్ కుమార్ నెక్ట్స్ టార్గెట్ చేస్తున్న సినిమాలేంటో చూద్దాం.

RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

బాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా,.. బ్యాక్ టూ బ్యాక్ సినిమా రిలీజ్ లతో పాటు సక్సెస్ లతో రికార్డ్ క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్.. 2022లో అదిరిపోయే మార్కెట్ ని చేతిలో పెట్టుకున్నారు. అంతేకాదు.. వచ్చే సంవత్సరం 2 వేల కోట్ల సంపాదనతో హయ్యస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ గా ట్రెండ్ సెట్ చేస్తున్నారు అక్షయ్ కుమార్.

Rajinikanth: అన్నాత్తై టీమ్ సభ్యులకు సూపర్ స్టార్ గోల్డ్ చైన్స్ గిఫ్ట్!

బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన సూర్యవన్షీ సినిమాలో 200 కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ కుమార్.. నెక్ట్స్ ఇయర్ రిలీజ్అయ్యే సినిమాలకు ఓటీటీ రైట్స్ తో సహా 2 వేల కోట్లు సంపాదించబోతున్నారు. అక్షయ్ ఈ మధ్యకాలంలో చేసిన ఏ సినిమా అయినా మినిమం 100 కోట్ల కన్నా తక్కువ కలెక్ట్ చెయ్యలేదు. బాక్సాఫీస్ కింగ్ గా ఇప్పటికే పేరున్న అక్షయ్ నెక్ట్స్ ఇయర్ 10 సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

KGF2: ‘కేజీఎఫ్ 2’ రీషూట్.. వైరల్ అవుతున్న యష్ ఫోటోలు

బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా అంతగా ఆడదో గెస్ చెయ్యగలిగే అక్షయ్ కి.. ప్రజెంట్ ఓటీటీ లో రిలీజ్ అవుతున్న అతరంగి సినిమాతో పాటు రామ్ సేతు, బచ్చన్ పాండే, పృద్విరాజ్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలే కాకుండా రక్షాబంధన్, ఓ మై గాడ్ కు సీక్వెల్ మూవీస్ కూడా షూటింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాయి. సినిమాలతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూనే వెబ్ ది ఎండ్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు అక్షయ్. ఇలా అటు బిగ్ స్క్రీన్ తో పాటు.. ఓటీటీల్ని కూడా కవర్ చేస్తూ.. నెక్ట్స్ ఇయర్ 2 వేల కోట్లు రాబట్టుకోబోతున్నారు అక్షయ్.