KGF2: ‘కేజీఎఫ్ 2’ రీషూట్.. వైరల్ అవుతున్న యష్ ఫోటోలు

కన్నడ సినీ పరిశ్రమ నుంచి గతంలో ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేదు. కానీ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా కన్నడ పరిశ్రమని కాదు యావత్ దేశాన్ని ఊపేసింది.

KGF2: ‘కేజీఎఫ్ 2’ రీషూట్.. వైరల్ అవుతున్న యష్ ఫోటోలు

Kgf2

KGF2: కన్నడ సినీ పరిశ్రమ నుంచి గతంలో ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా లేదు. కానీ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా కన్నడ పరిశ్రమని కాదు యావత్ దేశాన్ని ఊపేసింది. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని రెండు పార్టులుగా తీశారు. ఇప్పటికే ‘కేజీఎఫ్ 1’ రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కన్నడ పరిశ్రమకి కూడా బాగా ప్లస్ అయింది.

2022 Telugu Films: ఒక్కో హీరో నాలుగైదు సినిమాలు.. ఏడాదంతా జాతరే!

ఆ తర్వాత ‘కేజీఎఫ్ 2’ కూడా షూటింగ్ కంప్లీట్ చేశారు. కరోనా వల్ల ‘కేజీఎఫ్ 2’ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే ‘కేజీఎఫ్ 2’ షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమా విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో కొన్ని సీన్స్ మళ్ళీ రీషూట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అంతకు ముందు తీసిన ఫైట్ సీన్ ఇంకా బెటర్ గా మళ్ళీ షూటింగ్ చేస్తున్నారని చెప్తున్నారు.

Radhe Shyam: తెగ నచ్చేసిన ట్రైలర్.. సినిమా ఎలా ఉంటుందో లెక్కలేసుకుంటున్న ఫ్యాన్స్!

గతంలో ఈ సినిమా టెక్నీషియన్స్ కొంతమంది రీ షూటింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకి వచ్చింది. తాజాగా హీరో యష్ స్పాట్ లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇది రీ షూట్ కాదని.. కొన్ని ప్యాచ్ వర్క్స్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారని మరో టాక్ కూడా నడుస్తుంది. ఏదైనా ఈ షూటింగ్ లో హీరో యష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టిలతో పాటు మరికొందరు నటీనటులు కూడా పాల్గొనట్లు తెలుస్తుంది.