Radhe Shyam: తెగ నచ్చేసిన ట్రైలర్.. సినిమా ఎలా ఉంటుందో లెక్కలేసుకుంటున్న ఫ్యాన్స్!

లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నాడు రాధేశ్యామ్. సలీమ్-అనార్కలీ, దేవదాస్ -పార్వతి తర్వాత ప్రభాస్, పూజాహెగ్డేనే అని సినిమా మీద విపరీతమైన హైప్స్ పెంచేసిన రాధేశ్యామ్ ఆ అంచనాల్ని..

Radhe Shyam: తెగ నచ్చేసిన ట్రైలర్.. సినిమా ఎలా ఉంటుందో లెక్కలేసుకుంటున్న ఫ్యాన్స్!

Radhe Shyam

Radhe Shyam: లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్నాడు రాధేశ్యామ్. సలీమ్-అనార్కలీ, దేవదాస్ -పార్వతి తర్వాత ప్రభాస్, పూజాహెగ్డేనే అని సినిమా మీద విపరీతమైన హైప్స్ పెంచేసిన రాధేశ్యామ్ ఆ అంచనాల్ని అందుకోడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఓ అడుగు ముందుకేసింది. అదిరిపోయే యాక్షన్, అంతకుమించిన రొమాన్స్ తో పాటు అమేజింగ్ ట్విస్ట్ లతో రాధేశ్యామ్ ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా రాధేశ్యామ్.

83 Movie: 83 సినిమాపై బాలీవుడ్ కాన్ఫిడెంట్.. టీమ్ ఇండియాకు ప్రీమియర్ షో!

మూడేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి లేట్ అయినా ప్రమోషన్ల పండగని ఓ రేంజ్ లో స్టార్ట్ చేసింది టీమ్. రామోజీఫిల్మ్ సిటీలో ప్రేక్షకులే చీఫ్ గెస్ట్ లుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. రాధేశ్యామ్ కు సంబంధించి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన వీడియోలు, పాటలు ఒకఎత్తైతే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ మరో ఎత్తు. ఫాన్స్ లాంచ్ చేసిన ట్రైలర్.. సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది.

WWW Movie: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) సినిమా రివ్యూ

అదిరిపోయే రొమాన్స్, గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, అమేజింగ్ లొకేషన్స్ తో సినిమా ట్రైలర్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ట్రైలర్ తో పాటు.. ఆడియన్స్ సందడితో ప్రీ రిలీజ్ ఈవెంట్ పాన్ ఇండియా లెవల్లో హాట్ టాపిక్ అయ్యింది. జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి యాంకరింగ్ తో ఈవెంట్ ని వేరే లెవల్ కి తీసుకెళ్లాడు. అటు ఫాన్స్ తో పాటు టీమ్ ని చీర్ అప్ చేస్తూ.. ఎంగేజింగ్ ఎంటర్ టైన్ మెంట్ తో ఈవెంట్ కి లైవ్ లీ నెస్ తీసుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి.

Shyam Singha Roy: నాని శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ

వేల కొద్దీ అభిమానులు.. గంటలు గంటలు వెయిట్ చేసి తమ అభిమాన హీరోని చూసి ఫుల్ ఖుష్ అయిపోయారు. మూడేళ్ల నుంచి వెయిట్ చేసినా.. ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సినిమా రెడీ చేశారు టీమ్. ప్రభాస్, పూజాహెగ్డే కెమిస్ట్రీ సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తే ..రాధాకృష్ణ మేకింగ్ స్టైల్, స్టోరీ ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ఈవెంటే ఇంత హడావిడిగా ఉంటే.. జనవరి 14న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని లెక్కలేసుకుంటున్నారు జనాలు.