Bigg Boss Jessy : బిగ్ బాస్‌లో 10 వారాలకు జెస్సి పారితోషికం ఎంతో తెలుసా??

జెస్సి ఎంత పారితోషకం తీసుకున్నాడు అంటూ చర్చ జరుగుతుంది. జెస్సి మోడలింగ్ రంగంలో బాగానే పేరు సంపాదించాడు. ఎక్కువ మందికి జెస్సి తెలియకపోయిన జెస్సికి కూడా బాగానే రెమ్యూనరేషన్

Bigg Boss Jessy : బిగ్ బాస్‌లో 10 వారాలకు జెస్సి పారితోషికం ఎంతో తెలుసా??

Jessyj

Bigg Boss Jessy :  బిగ్‌బాస్‌ లో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ వల్ల బాగా కలిసొస్తుంది. కెరీర్ డల్ గా ఉన్న వాళ్ళకి, కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిన వాళ్ళకి బిగ్ బాస్ బాగా ఉపయోగపడుతుంది. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ఈ ఫేమ్ తో ఛాన్సులు తెచ్చుకుంటారు చాలా మంది కంటెస్టెంట్స్. బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళకి వారానికి ఇంత అని పారితోషికం కూడా ఇస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ పారితోషకం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. బిగ్ బాస్ వచ్చే వాళ్లకి అప్పటి వరకు ఉన్న వాళ్ళ కెరీర్ ని బట్టి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోయింగ్ ని బట్టి ఈ పారితోషకం ఉంటుంది. బిగ్ బాస్ లో ఎన్ని వారాలు ఉంటే అంత పారితోషకం ఇస్తారు నిర్వాహకులు.

Samantha : ‘పుష్ప’ ఐటెం సాంగ్ కోసం సమంత భారీ రెమ్యూనరేషన్..

బిగ్‌బాస్‌ షో ఇప్పటికే 10 వారాలు గడిచిపోయాయి. ఇప్పటివరకు హౌస్‌ నుంచి 9 మంది ఎలిమినేట్ అయ్యారు. వీళ్లంతా కూడా రెమ్యూనరేషన్ బాగానే తీసుకున్నారు. తాజాగా 10వ వారం బిగ్ బాస్ నుంచి జెస్సి అనారోగ్య కారణాలతో వెళ్ళిపోయాడు. దీంతో నామినేషన్‌లో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కాజల్‌ సేఫ్‌ అయ్యింది.

Bigg Boss 5 : మరోసారి నామినేషన్స్ గొడవ.. ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్లోనే

ఇప్పుడు జెస్సి ఎంత పారితోషికం తీసుకున్నాడు అంటూ చర్చ జరుగుతుంది. జెస్సి మోడలింగ్ రంగంలో బాగానే పేరు సంపాదించాడు. ఎక్కువ మందికి జెస్సి తెలియకపోయిన జెస్సికి కూడా బాగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. జెస్సి వారానికి ఒక లక్ష రూపాయల వరకు తీసుకున్నాడని సమాచారం. ఈ లెక్కన జెస్సి బిగ్ బాస్ లో 10 వారాలు ఉండటంతో దాదాపు 10 లక్షలు తీసుకున్నాడని సమాచారం. మరి అనారోగ్య కారణాలతో బయటకి వచ్చేసిన జెస్సి కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి. తన మోడలింగ్ రంగంలోనే ఉంటాడా లేక యాక్టింగ్ వైపు కూడా వెళ్తాడా ముందు ముందు తెలుస్తుంది.