Bigg Boss 5 : మరోసారి నామినేషన్స్ గొడవ.. ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్లోనే

ఇప్పటికే 10 వారాలు పూర్తయింది బిగ్ బాస్ మొదలయి. నిన్న 11వ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ జరిగింది. ఈ సారి కూడా ఒక్కొక్కరు వేరే వాళ్లపై ఉన్న కోపాల్ని బయటకి చెప్పి నామినేట్ చేశారు. ఈ సారి

Bigg Boss 5 : మరోసారి నామినేషన్స్ గొడవ.. ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్లోనే

Bb Nominations

Bigg Boss 5 :  బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ అయిపోవడంతో మళ్ళీ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలాగే నామినేషన్స్ అంటే ముందు గొడవలే వస్తాయి ఆ తర్వాతే నామినేట్ చేస్తారు. ఈ సారి కూడా ఒక్కొక్కరు వేరే వాళ్లపై ఉన్న కోపాల్ని బయటకి చెప్పి నామినేట్ చేశారు. ఈ సారి నామినేషన్స్ మరింత కొత్తగా జరిగాయి. ఒక టేబుల్ పై కొన్ని బాటిల్స్ లో చిక్కటి రంగు నీళ్ళని పెట్టాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలి అనుకుంటారో వాళ్ళ మీద ఆ నీళ్ళని పోసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పాలి.

Radheshyam first song : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ అద్భుతమైన లిరిక్స్…

ఇప్పటికే 10 వారాలు పూర్తయింది బిగ్ బాస్ మొదలయి. నిన్న 11వ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ జరిగింది.

మొద‌ట‌గా కెప్టెన్ ర‌వి.. త‌న‌ను ఫేక్ అన‌డం న‌చ్చ‌లేదంటూ స‌న్నీని, స‌న్నీని రెచ్చ‌గొట్టిందంటూ కాజ‌ల్‌ను నామినేట్ చేశాడు.
ష‌ణ్ముఖ్‌.. కాజ‌ల్ ఇంటి నుంచి వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గిపోతాయ‌ని అంటూ కాజల్ ని నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంక సింగ్‌ని కూడా నామినేట్ చేశాడు.
మాన‌స్‌.. ష‌ణ్ను, యానీ మాస్ట‌ర్‌ను నామినేట్ చేశాడు.
శ్రీరామ్‌.. మాన‌స్‌, స‌న్నీని నామినేట్ చేశాడు.
కాజ‌ల్.. నేను ఎంత ట్రై చేసినా క‌నెక్ట్ కావ‌ట్లేదని, పైగా వెక్కిరించ‌డం అస్స‌లు న‌చ్చ‌లేదంటూ యానీని నామినేట్ చేసింది. దీంతో యానీ మరోసారి వెక్కిరించింది. అలాగే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గిపోతాయ‌నుకోవ‌డం నాకు న‌చ్చ‌లేద‌ని ష‌ణ్నును కూడా నామినేట్ చేసింది.
సిరి.. కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌లో ప్రియాంక సింగ్ నాకు స‌పోర్ట్ చేయలేదంటూ ప్రియాంకని నామినేట్ చేసింది. అంతే కాక సిల్లీ రీజ‌న్స్ ఇవ్వ‌కంటూ కాజ‌ల్ ని కూడా నామినేట్ చేసింది.
త‌ర్వాత ప్రియాంక సింగ్‌.. సిరి, ష‌ణ్ముఖ్‌ల‌ను నామినేట్ చేసింది.
స‌న్నీ.. శ్రీరామ్‌ను, సిరిని నామినేట్ చేశాడు. ఈ సమయంలో సన్నీ మరోసారి శ్రీరామ్‌తో గొడవ పడ్డాడు.
యానీ.. మాన‌స్ ని నామినేట్ చేసింది. ఎప్పట్లాగే కాజల్ ని వెక్కిరిస్తూ కాజల్ ని కూడా నామినేట్ చేసింది.

Samantha : ‘ఖతిజా’గా సమంత.. సమంతలో మరో కొత్తకోణం

మొత్తంగా 11వ వారం నామినేషన్స్ లో కెప్టెన్ ర‌వి తప్ప మిగిలిన 8 మంది నామినేష‌న్‌లో ఉన్నారు. మరి వీళ్ళలో ఈ వీకెండ్ కి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.