Bigg Boss 5 : స్పెషల్ పవర్ తో నామినేషన్స్ నుంచి వీళ్ళు సేఫ్
నామినేషన్స్ నుంచి ఒకర్ని తప్పించడానికి ఇంటి సభ్యులకు బ్యాగ్స్ తో ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు తమ ఫోటో కాకుండా మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగు తీసుకొని సేఫ్ జోన్ లోకి
Bigg Boss 5 : బిగ్ బాస్ లో రోజూ గొడవలతో పాటు ఇప్పుడు రోజుకొక ట్విస్ట్ కూడా నడుస్తుంది. బిగ్ బాస్ తనకి ఇష్టమొచ్చినట్టు గేమ్ ని మారుస్తున్నాడు. ఈ వారం కెప్టెన్ షన్ను తప్ప మిగిలిన 10 మంది నామినేషన్ లో ఉన్నారు. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ముందు రోజు 10 మంది నామినేషన్లో ఉన్నారని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇద్దర్ని సేఫ్ చేసాడు బిగ్ బాస్.
Sai Pallavi : అలాంటి సినిమాలు చేయాలని ఉంది.. కానీ ఛాన్స్ రావట్లేదు : సాయి పల్లవి
నామినేషన్స్ నుంచి ఒకర్ని తప్పించడానికి ఇంటి సభ్యులకు బ్యాగ్స్ తో ఓ టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు తమ ఫోటో కాకుండా మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగు తీసుకొని సేఫ్ జోన్ లోకి వెళ్ళాలి. చివరగా వెళ్లిన వాళ్ళు, వాళ్ళతో పాటు బ్యాగ్ మీద ఎవరి ఫోటో ఉంటే వాళ్ళు డేంజర్ జోన్ లోకి వెళ్తారు. సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకర్ని నామినేట్ చేయాలి. ఇలా చివరికి ఒక్కరు మిగిలే దాకా ఈ గేమ్ ఉంటుంది. ఈ గేమ్ లో చివరి వరకు ఆడి యాని మాస్టర్ నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. దీంతో యాని మాస్టర్ కి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్.
Pawan Klayan : బాలీవుడ్ యాక్టర్స్ తో షూట్ మొదలు పెట్టిన ‘హరి హర వీరమల్లు’
ఇక నామినేషన్లో 9మంది ఉండగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. యానీ మాస్టర్‌కు లభించిన స్పెషల్ పవర్‌తో ఒకరిని నామినేషన్ నుంచి తప్పించవచ్చనే అవకాశం ఇచ్చాడు. దీంతో యానీ మాస్టర్ మానస్‌ని సేవ్ చేసింది. గతంలో మానస్ తన కోసం లెటర్ త్యాగం చేశాడు అందుకే ఇప్పుడు నేను మానస్ ని సేవ్ చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది. దీంతో కెప్టెన్ షన్ను, యానీ మాస్టర్, మానస్ తప్ప మిగిలిన అందరూ ఈ వారం నామినేషన్లో ఉన్నారు.