Bigg Boss Priya : ప్రియా కూతురి పెళ్ళిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి

నిన్న నవంబర్‌ 21న ప్రియ అక్క కూతురు, ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ ని కూడా ఆహ్వానించింది ప్రియా. ఈ పెళ్లి

Bigg Boss Priya : ప్రియా కూతురి పెళ్ళిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి

Priya

Bigg Boss Priya :  ఎన్నో సంవత్సరాలుగా సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియ. ఇటీవల బిగ్‌బాస్‌ షో నుంచి ఆఫర్ రావడంతో షోలో ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో కాస్త డల్ గా అనిపించినా తర్వాత రెచ్చిపోయింది. కెప్టెన్ అవ్వలేదని తెలిసి కూడా కూల్ గా గేమ్ ఆడింది. కానీ అనూహ్యంగా హౌస్ లో కెప్టెన్ కూడా అయింది. లాస్ట్ లో కంటెస్టెంట్స్ మీద అరవడం, తిట్టడం లాంటివి చేయడంతో ఏడో వారంలో షో నుంచి ఎలిమినేట్ అయిపొయింది.

Bigg Boss 5 : నన్ను రెచ్చగొట్టకు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కి డైలాగులు అంకితం

బిగ్ బాస్ షో ప్రియకి బాగానే కలిసొచ్చింది. ప్రియకి మామూలుగా ఆఫర్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇక బిగ్ బాస్ తర్వాత కూడా వరుస ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. అంతే కాక బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రియా ఇంస్టాగ్రామ్ కి ఏకంగా ఒక మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఇంతమంది ఫాలోయింగ్ బహుశా తెలుగులో ఇదే మొదటిసారి. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ఒక పక్క తన షూటింగ్స్ చేస్తూనే మరో పక్క బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ని కూడా అప్పుడప్పుడు కలుస్తుంది. తాజాగా ఈ సీజన్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని మరోసారి కలిసింది ప్రియా.

Allu Arha : బుర్జ్‌ఖలీఫాలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని కొత్త రికార్డు సృష్టించిన అల్లు అర్హ

నిన్న నవంబర్‌ 21న ప్రియ అక్క కూతురు, ప్రియకు వరుసకు కూతురయ్యే లోహిత పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. ఈ వివాహ వేడుకలకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ ని కూడా ఆహ్వానించింది ప్రియా. ఈ పెళ్లి వేడుకకి జెస్సీ, ఉమాదేవి, సరయు, నటరాజ్ మాస్టర్ వచ్చారు. ఈ పెళ్ళి వేడుకల్లో వీళ్ళు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు వీరితో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.