Bimbisara: తేనె పలుకులు పలికిస్తున్న బింబిసారా

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ రిలీజ్‌కు దగ్గరవుతుండటంతో, ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ సినిమా నుండి రెండో సింగిల్ ‘ఓ తేనె పలుకులా’ అనే ఫోక్ మెలోడి పాటను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

Bimbisara: తేనె పలుకులు పలికిస్తున్న బింబిసారా

Bimbisara Second Single Song Update

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బింబిసారా’ తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో దర్శకుడు వశిష్ట్ తెరకెక్కిస్తున్న ఈ ఫాంటెసీ డ్రామా మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’లో ఎన్టీఆర్.. జోష్ లో నందమూరి అభిమానులు..

ఇక కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా ఈ సినిమా టీజర్స్ చూస్తే అర్థమవుతోంది. కాగా ఇప్పటికే ఒక పాటను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు రెండో సింగిల్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. ‘ఓ తేనె పలుకుల’ అంటూ సాగే ఫోక్ మెలోడీ పాటను జూలై 21న ఆడియో రూపంలో.. జూలై 23న వీడియో రూపంలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

NTR: బింబిసారుడికి భీమ్ అభయం.. బాక్సాఫీస్‌కు చుక్కలేనట!

ఈ పాటలో అందాల భామ కేథరిన్ త్రేజాతో కళ్యాణ్ రామ్ రొమాన్స్ చేయనున్నట్లు అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో మరో బ్యూటీ సంయుక్తా మీనన్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు కళ్యాణ్ రామ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.