Balakrishna : మాట నిలబెట్టుకున్న బాలయ్య.. క్యాన్సర్ పేషెంట్‌కి ఉచిత వైద్యం

దాంతో బాలయ్య తన బసవతారకం ఆసుపత్రిలో అజీజ్ సోదరికి ఉచితంగా వైద్యం చేయిస్తానని మాట ఇచ్చాడు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చిన మోహన్ బాబు ఆ అబ్బాయికి చదువు ఫ్రీగా చెప్పిస్తానని మాట

Balakrishna : మాట నిలబెట్టుకున్న బాలయ్య.. క్యాన్సర్ పేషెంట్‌కి ఉచిత వైద్యం

Balayya

Balakrishna :  బాలయ్య బాబు బయట ఎలా ఉన్న ఆయన మనసు మంచిదని, ఆయన చాలా మంచివాడని ఇండస్ట్రీతో పాటు బయట వాళ్ళకి కూడా తెలుసు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బసవతారకం హాస్పిటల్ లో ఎంతో మందికి ఉచిత క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు బాలయ్య. ఇటీవల బాలయ్య్యా ఆహా ఓటిటిలో యాంకర్ గా ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అనే షో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయి ట్రెండ్ అయింది.

Telugu Cinema : తెలుగు సినీ పరిశ్రమలో మరో ఎన్నికల యుద్దం.. మొదలైన వివాదాలు

ఈ షోలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఒక్కరికైనా సాయం కూడా చేయాలని బాలయ్య అనుకున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ లో అజీజ్ అనే కుర్రాడు, తన సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం చదువు మానేసి పని చేస్తున్నాను అని తెలిపాడు. తన అక్కను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ కుర్రాడు కూలీ పని చేయడం బాలయ్యను కదిలించింది. దాంతో బాలయ్య తన బసవతారకం ఆసుపత్రిలో అజీజ్ సోదరికి ఉచితంగా వైద్యం చేయిస్తానని మాట ఇచ్చాడు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చిన మోహన్ బాబు ఆ అబ్బాయికి చదువు ఫ్రీగా చెప్పిస్తానని మాట ఇచ్చాడు.

Bigg Boss 5 : బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే : విశ్వ

తాజాగా బాలయ్య ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అజీజ్ సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆమెను నిన్న బసవతారకం హాస్పిటల్ లో చేర్పించినట్లు తెలిసింది. ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. ఎప్పటి నుండో బాలయ్య బాబు వాళ్ళ అమ్మ గారి జ్ఞాపకార్థం బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్‌, హాస్పిటల్ నుండి ఎంతో మంది పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మరోసారి బాలయ్య చేసిన పనిని అభినందిస్తూ అభిమానులు, నెటిజన్లు బాలయ్యబాబు మనసు ఎంత మంచిదో అంటూ పొగిడేస్తున్నారు.