Bigg Boss 5 : బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే : విశ్వ

గేమ్‌ బాగా ఆడే విశ్వ వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఇంటి సభ్యులు అన్నారు. ఇక విశ్వ వెళ్లిపోతూ కంటెస్టెంట్లకు ర్యాంకులు ఇచ్చాడు.

Bigg Boss 5 : బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే : విశ్వ

Vishwa

Bigg Boss 5 :  గత 9 వారాల నుంచి సాగుతున్న బిగ్ బాస్ ఒక్కో వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే 8 మంది ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఈ వారం 9వ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. విశ్వ 9వ కంటెస్టెంట్ గా ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేషన్ తర్వాత విశ్వ నాగార్జున వద్దకు వచ్చి మాట్లాడాడు.

Pushpaka Vimanam: మహబూబ్‌నగర్‌లో స్పెషల్ ప్రీమియర్ షో మీ కోసమే: రౌడీ హీరో

బెస్ట్‌ సంచాలకుడు, బెస్ట్‌ రేషన్‌ మేనేజర్‌, బెస్ట్‌ కెప్టెన్‌, బిగ్‌బాస్‌ హౌస్‌కు సూపర్‌ హీరో విశ్వ అని కంటెస్టెంట్స్ అందరూ పొగిడారు. గేమ్‌ బాగా ఆడే విశ్వ వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఇంటి సభ్యులు అన్నారు. ఇక విశ్వ వెళ్లిపోతూ కంటెస్టెంట్లకు ర్యాంకులు ఇచ్చాడు.

BiggBoss 5 : బిగ్ బాస్ విశ్వకి 9 వారాలకి భారీ రెమ్యునరేషన్

ఇంట్లోకి వెళ్లాక నా మనసుకు కనెక్ట్‌ అయిన మొదటి వ్యక్తి ప్రియాంక అంటూ ఆమెకు 10వ ర్యాంక్‌ ఇచ్చాడు.
కాజల్‌ బాగా ఆడుతుందని, కానీ తను ధైర్యాన్ని కోల్పోతుందంటూ 9వ ర్యాంకిచ్చాడు.
నువ్వు స్ట్రాంగ్‌, కానీ గేమ్‌లో గివప్‌ ఇవ్వకూడదని జెస్సీకి సలహా ఇస్తూ అతడికి 8వ స్థానం ఇచ్చాడు. యానీ మాస్టర్ ఫైటర్‌ అని మెచ్చుకుంటూ ఆమెకు 7వ ర్యాంకిచ్చాడు.
గెలుపోటములు సహజమని, ఓడిపోయినప్పుడు అతిగా బాధపడొద్దని మానస్‌కు సూచిస్తూ 6వ ర్యాంక్‌ ఇచ్చాడు.
తర్వాత టాప్‌ 5 కంటెస్టెంట్ల గురించి చెప్పాడు. సిరి టాప్‌ 5లో ఉండాలన్నాడు.
సన్నీ ఇలా కూల్‌గా ఉంటే బాగోలేడని, నువ్వు నీలాగే ఉండంటూ అతడికి 4వ ర్యాంకిచ్చాడు.
గెలిస్తే చిల్‌ అవుతూ ఓడిపోతే కింద కుంపటి పెట్టినట్లు ఫీల్‌ అవుతావు అంటూ షణ్ముఖ్‌కు 3వ స్థానం ఇచ్చాడు.
రవిని అందరూ గుంటనక్క అనుకుంటారు, కానీ అతడు అలాంటివాడు కాదంటూ రవికి 2వ స్థానం ఇచ్చాడు.
శ్రీరామ్‌ గురించి చెప్తూ ఎమోషనల్‌ అయ్యాడు విశ్వ. తాను కోల్పోయిన తమ్ముడిని శ్రీరామ్‌లో చూసుకుంటున్నాననంటూ కంటతడి పెట్టాడు. అతడు ఈ సీజన్ విన్నర్ గా నిలవాలి అని కోరుకుంటున్నాను అంటూ శ్రీరామ్ కి మొదటి స్థానం ఇచ్చాడు.