BiggBoss 5 : బిగ్ బాస్ విశ్వకి 9 వారాలకి భారీ రెమ్యునరేషన్

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఆ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ వివరాలు బయటకి వస్తున్నాయి. తాజాగా విశ్వా రెమ్యూనరేషన్ ఎంతో కూడా బయటకి తెలిసింది. వచ్చిన సమాచారం ప్రకారం విశ్వా వారానికి

BiggBoss 5 : బిగ్ బాస్ విశ్వకి 9 వారాలకి భారీ రెమ్యునరేషన్

Viswa

BiggBoss 5 : చాలామంది సెల‌బ్రిటీల‌కు బిగ్‌బాస్‌ వల్ల బాగా కలిసొస్తుంది. కెరీర్ డల్ గా ఉన్న వాళ్ళకి, కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిన వాళ్ళకి బిగ్ బాస్ బాగా ఉపయోగపడుతుంది. బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళకి వారానికి ఇంత అని పారితోషకం కూడా ఇస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ పారితోషకం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. బిగ్ బాస్ వచ్చే వాళ్లకి అప్పటి వరకు ఉన్న వాళ్ళ కెరీర్ ని బట్టి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోయింగ్ ని బట్టి ఈ పారితోషకం ఉంటుంది. బిగ్ బాస్ లో ఎన్ని వారాలు ఉంటే అంత పారితోషకం ఇస్తారు నిర్వాహకులు.

Akshay Kumar : అక్షయ కుమార్ సినిమాకి పంజాబ్ రైతుల సెగ

బిగ్‌బాస్‌ షో ఇప్పటికే 9 వారాలు గడిచిపోయాయి. ఇప్పటివరకు హౌస్‌ నుంచి 8 మంది ఎలిమినేట్ అయ్యారు. వీళ్లంతా కూడా రెమ్యూనరేషన్ బాగానే తీసుకున్నారు. తాజాగా 9వ వారం బిగ్ బాస్ నుంచి విశ్వా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ ముందు విశ్వా కొన్ని సీరియల్స్ చేస్తున్నాడు. మరి బిగ్ బాస్ వల్ల కెరీర్ పరంగా ఎంత ప్లస్ అవుతుందో తెలీదు కానీ రెమ్యూనరేషన్ మాత్రం భారీగానే తీసుకున్నాడని సమాచారం.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఎవరు హీరో ? ఎవరు విలన్?

ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఆ కంటెస్టెంట్ రెమ్యునరేషన్ వివరాలు బయటకి వస్తున్నాయి. తాజాగా విశ్వా రెమ్యూనరేషన్ ఎంతో కూడా బయటకి తెలిసింది. వచ్చిన సమాచారం ప్రకారం విశ్వా వారానికి రెండు లక్షల వరకు అంతకు పైనే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ లెక్కన అతడు 9 వారాలకు దాదాపు 18 లక్షలకు పైగా సంపాదించినట్టు సమాచారం అందుతుంది.