Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఎవరు హీరో ? ఎవరు విలన్?

నిన్నటి ఎపిసోడ్ లో ఎవరు హీరో? ఎవరు విలన్‌? అనే గేమ్‌ ఆడించాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో కంటెస్టెంట్స్ అంతా ఇంటిలో ఉన్న వాళ్లలో ఎవరు హీరోగా అనిపించారు? ఎవరు విలన్ గా అనిపించారు? అని

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఎవరు హీరో ? ఎవరు విలన్?

Bb5 (1)

Bigg Boss 5 :  బిగ్ బాస్ మొన్నటి ఎపిసోడ్ లో కొత్త కెప్టెన్ గా యాని మాస్టర్ ఎన్నికయ్యారు. మళ్ళీ ఎప్పటిలాగే ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టే టాస్కులతో వచ్చేసాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో ఎవరు హీరో? ఎవరు విలన్‌? అనే గేమ్‌ ఆడించాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో కంటెస్టెంట్స్ అంతా ఇంటిలో ఉన్న వాళ్లలో ఎవరు హీరోగా అనిపించారు? ఎవరు విలన్ గా అనిపించారు? అని చెప్పాల్సి ఉంటుంది. ఆలా చెప్పి హీరో అనిపించే వాళ్ళకి స్టార్ బ్యాడ్జ్ పెట్టాలి. విలన్ అనిపించే వాళ్ళకి క్రాస్ మార్క్ పెట్టాలి.

Karthikeya : ఈ నెలలో నా పెళ్లి.. ఇప్పటి దాక నాకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు

ముందుగా సిరి.. షణ్ముఖ్‌కు స్టార్‌ బ్యాడ్జ్‌ పెట్టి అతడు ఎప్పుడూ నాకు హీరోనే అని చెప్పింది. ప్రియాంక సింగ్‌ తనకు విలన్‌ అని తెలిపింది.
ప్రియాంక.. మానస్‌ హీరో అని, సిరి విలన్‌ అని తెలిపింది.
శ్రీరామ్‌.. విశ్వ తన హీరో అని, సిరి విలన్‌ అని చెప్పాడు.
కాజల్‌.. నన్ను విలన్‌ అనుకుంటున్న యానీయే నాకు విలన్‌, ఇక సన్నీకి హీరో బ్యాడ్జ్‌ పెట్టబోగా అతడు ఇది ఎక్స్‌పెక్ట్‌ చేయలేదన్నాడు. దీంతో కాజల్‌ యూటర్న్‌ తీసుకుని మానస్‌కు స్టార్‌ బ్యాడ్జ్‌ పెట్టి నేను నమ్ముతున్న ఏకైక వ్యక్తి మానస్‌ అంటూ అతడిని హీరోను చేసింది కాజల్.
సన్నీ.. జెస్సీ హీరో అవ్వాలంటూ అతడికి స్టార్‌ బ్యాడ్జ్‌ పెట్టి, ప్రియాంకను విలన్‌ అని చెప్పాడు.
తర్వాత రవి.. టాస్కుల్లో 100 శాతం కష్టపడతాడంటూ విశ్వను హీరోగా, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని షణ్ను విలన్‌ గా చెప్పాడు.
షణ్ను.. తనకెప్పుడూ ఒకరే విలన్‌ అంటూ రవి మీద క్రాస్‌ గుర్తు గుద్దాడు. ఈ విలన్‌ లేకపోతే తాను హీరో అవలేనన్నాడు. అబ్బాయిల కంటే బాగా గేమ్‌ ఆడే సిరి హీరో అని పొగిడాడు.
యానీ.. కాజల్‌తో కంఫర్టబుల్‌గా లేనంటూ ఆమెను విలన్‌గా, మొదటి వారం నుంచి చాలా చక్కగా ఆడుతాన్నాడంటూ విశ్వని హీరోగా తెలిపింది.
విశ్వ.. శ్రీరామ్‌ హీరో అని, ప్రియాంక సింగ్‌ విలన్‌ అని చెప్పాడు.

జెస్సీ.. తన గురించి ఎంతో కేర్‌ తీసుకుంటూ, అమ్మలా చూసుకునే సిరి హీరో అని, గేమ్‌లో డల్‌ అవుతున్న కాజల్‌ విలన్‌ అని చెప్పాడు.
మానస్‌.. ప్రియాంక తనకు హీరో అని చెప్పడంతో ఆమె ఆనంద భాష్పాలు కార్చింది, రవి విలన్‌ అని చెప్పాడు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు ‘బసవశ్రీ’ పురస్కారం

మొత్తంగా ఈ టాస్క్‌లో విశ్వ ఈ హౌస్‌కు హీరోగా, ప్రియాంకను విలన్‌గా తెలిపాడు నాగార్జున. అయితే హీరో, విలన్‌ ఏ ట్యాగూ రాని సన్నీని హీరోకు, విలన్‌కు మధ్యలో ఉన్న కమెడియన్‌ అన్నాడు నాగ్‌.