Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు ‘బసవశ్రీ’ పురస్కారం

పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు ‘బసవశ్రీ’ పురస్కారం ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని మురుఘ మఠం నిర్ణయించింది. ఈ పురస్కారం కేవలం కర్ణాటక వాళ్ళకే దక్కుతుంది. కర్ణాటకలో

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు ‘బసవశ్రీ’ పురస్కారం

Puneeth

Updated On : November 7, 2021 / 6:50 AM IST

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి వారం అవుతున్నా ఆయన అభిమానులు, కర్ణాటక ప్రజలు ఇంకా ఆ బాధని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఆ బాధనుంచి బయటకి రాలేదు. పునీత్ సమాధిని చూడటానికి రోజూ వేలల్లో అభిమానులు తరలి వస్తున్నారు. ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ మరణించినప్పుడు కర్ణాటక సీఎం, ప్రభుత్వం అన్ని దగ్గరుండి నడిపించారు. అంత గొప్ప వ్యక్తి పునీత్. తాజాగా పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటకలో అత్యుత్తమమైన పురస్కారాన్ని ఇవ్వనున్నారు.

Balakrishna : బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో

పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు ‘బసవశ్రీ’ పురస్కారం ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని మురుఘ మఠం నిర్ణయించింది. ఈ పురస్కారం కేవలం కర్ణాటక వాళ్ళకే దక్కుతుంది. కర్ణాటకలో ఎన్నో సేవ కార్యక్రమాలు, మంచి పనులు చేసిన అతి కొద్ది మందికి ఈ పురస్కారాన్ని అందచేస్తారు. కర్ణాటక ప్రజలు ఎక్కువగా కొలిచే బసవేశ్వరుడు జ్ఞాపికగా దీనిని అందిస్తారు. బసవ జయంతి రోజు ఈ పురస్కారాన్ని పునీత్‌ కుటుంబీకులు స్వీకరించనున్నారు. ఈ పురస్కారం కింద 5లక్షల నగదు, జ్ఞాపిక అందజేయనున్నారు. ఈ నెల 10న మురుఘ మఠాధిపతి శివమూర్తి శివాచార్య స్వామిజీ బెంగళూరు సదాశివనగర్‌లోని పునీత్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇదే సమయంలో ‘బసవశ్రీ’ పురస్కారాన్ని స్వీకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ పురస్కారం కింద లభించే మొత్తాన్ని పునీత్‌ నిర్వహణలోని వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.