Balakrishna : బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో

బాలయ్య ఆహాలో 'అన్ స్టాపబుల్ విత్ NBK' ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ షో షూటింగ్ పూర్తి అయ్యాక గోపీచంద్ సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాలయ్య కి విలన్ గా కన్నడ స్టార్ హీరో

Balakrishna : బాలయ్య సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో

Balayya (1)

Balakrishna :  బాలయ్య బాబు ఇటీవలే బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ సినిమా షూటింగ్ పూర్తి చేసేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ తన తర్వాతి సినిమాని గోపీచంద్ మలినేనితో అనౌన్స్ చేసాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ సినిమా స్టార్ట్ అయ్యేలోపు బాలయ్య ఆహాలో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం చేస్తున్నారు. ఈ షో షూటింగ్ పూర్తి అయ్యాక గోపీచంద్ సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్నందుకు గోపీచంద్ ఈ సారి బాలయ్యతోనూ ఓ బ్లాక్ బస్టర్ తీయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే బాలయ్యకి బాగా కలిసొచ్చిన, బాగా పేరు తెచ్చిన ఫ్యాక్షన్ జోనర్ ని ఎంచుకున్నాడు. రాయలసీమ, కర్ణాటక బోర్డర్ లో జరిగే ఫ్యాక్షన్ కథతో సినిమాని తీయబోతున్నట్టు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు కాస్ట్ క్రూ ఎంపిక కూడా జరుగుతుంది.

Radheshyam Climax : ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ కోసం సంవత్సరం కష్టపడ్డాం

ఈ సినిమాలో బాలయ్య కి విలన్ గా కన్నడ స్టార్ హీరోని తీసుకున్నట్టు సమాచారం. కన్నడలో హీరోగా ఊర మాస్ సినిమాలు చేసే దునియా విజయ్ ని బాలయ్య కి విలన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దునియా విజయ్ కన్నడలో మొదట చిన్న చిన్న పాత్రలే చేశాడు. అతను హీరోగా నటించిన ‘దునియా’ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. ఇప్పటిదాకా దాదాపు నలభై సినిమాల్లో నటించాడు విజయ్. ఇటీవలే ‘సలాగా’ అనే సినిమాతో వచ్చి కన్నడలో మంచి విజయం సాధించాడు. కన్నడ నుంచి వచ్చి చాలా మంది తెలుగులో విలన్ గా చేశారు. తెలుగులో కూడా మార్కెట్ చేసుకుంటున్నారు. దునియా విజయ్ కూడా విలన్ గా సక్సెస్ అయి తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకుంటాడేమో చూడాలి.