Radheshyam Climax : ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ కోసం సంవత్సరం కష్టపడ్డాం

రాధే శ్యామ్ క్లైమాక్స్ పై నేను దాదాపుగా ఒక సంవత్సరం నుంచి పని చేస్తున్నాను. అలాంటి క్లైమాక్స్ ని ఎగ్జిక్యూట్ చేయటం, ప్రేక్షకులను ఒప్పించటం అంత ఈజీ కాదు. దాని మీద కంటిన్యూగా

Radheshyam Climax : ‘రాధేశ్యామ్’ క్లైమాక్స్ కోసం సంవత్సరం కష్టపడ్డాం

Radheshyam

Radheshyam Climax :  పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ ప్రేమకథా చిత్రంగా 1970ల కాలం నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ‘రాధే శ్యామ్’ తెరకెక్కుతుంది. పూజాహెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో కెకె రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పామిస్ట్ (హస్తసాముద్రికా నిపుణుడు) గా కనపడనున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ టీజర్ చూస్తుంటే సినిమా కచ్చితంగా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుందని ప్రకటించారు.

Tamara : ‘భీమ్లా నాయక్’ కెమెరామెన్ తో ఇంటర్నేషనల్ సినిమాని అనౌన్స్ చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్

ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా కెమెరామెన్ మనోజ్ పరమహంస ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాధే శ్యామ్ క్లైమాక్స్ పై నేను దాదాపుగా ఒక సంవత్సరం నుంచి పని చేస్తున్నాను. అలాంటి క్లైమాక్స్ ని ఎగ్జిక్యూట్ చేయటం, ప్రేక్షకులను ఒప్పించటం అంత ఈజీ కాదు. దాని మీద కంటిన్యూగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. నేను, డైరెక్టర్ కలిసి సంవత్సరం పైగా ఈ క్లైమాక్స్ కోసం కష్టపడ్డాం అని అన్నారు. ప్రేక్షకులకు క్లైమాక్స్ లో అనేక ఆసక్తికరమైన విషయాలు చూపించబోతున్నాం అని తెలిపారు. ఈ క్లైమాక్స్ దాదాపు 15 నిముషాలు ఉంటుందని అన్నారు.

Bigg Boss 5 : విలన్స్ టీం నుంచి బిగ్ బాస్ లో కొత్త కెప్టెన్

‘రాధేశ్యామ్’ సినిమాలో విషాద క్లైమాక్స్ ఉండబోతుందని ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. టీజర్ చూస్తే కూడా అదే అనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ కోసం నిర్మాతలు ఏకంగా యాబై కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో గాని క్లైమాక్స్ మాత్రం స్పెషల్ గా ఉండబోతోందని సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస చెప్పిన దాన్ని బట్టి అర్థం అవుతోంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీతో పాటుగా చైనీస్ జపనీస్ వంటి విదేశీ బాషల్లోనూ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపారు.