Karthikeya : ఈ నెలలో నా పెళ్లి.. ఇప్పటి దాక నాకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు

కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత నేను చేసిన సినిమాల వల్ల నాకు యాక్టర్‌గా పేరు వచ్చింది కాని నేనంటే ఇష్టపడే వారు గర్వంగా చెప్పుకునే కమర్షియల్‌ హిట్‌ మూవీ రాలేదు.

Karthikeya : ఈ నెలలో నా పెళ్లి.. ఇప్పటి దాక నాకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు

Karthikeya

Karthikeya :  ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నాడు హీరో కార్తికేయ. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో బాగా గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ ఒక్కటి కూడా రాలేదు. మధ్యలో ‘గ్యాంగ్ లీడర్’ లో విలన్ గా చేసి మెప్పించాడు. దీంతో తమిళ్ స్టార్ హీరో అజిత్ సరసన కూడా విలన్ రోల్ రావడంతో తమిళ్ లో కూడా నిలదొక్కుకోవాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు కార్తికేయ. ఒక పక్క హీరోగా, మరో పక్క విలన్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా కార్తికేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కు ‘బసవశ్రీ’ పురస్కారం

ఈ ఈవెంట్ లో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత నేను చేసిన సినిమాల వల్ల నాకు యాక్టర్‌గా పేరు వచ్చింది కాని నేనంటే ఇష్టపడే వారు గర్వంగా చెప్పుకునే కమర్షియల్‌ హిట్‌ మూవీ రాలేదు. ఇక నుంచి నన్ను ఇష్టపడేవారు గర్వపడేలా కథలు ఎంచుకుంటానని మాట ఇస్తున్నా అని అన్నారు. ‘రాజా విక్రమార్క’ అనగానే చిరంజీవిగారు గుర్తొస్తారు. ఆయన అభిమానిగా ధైర్యం చేసి ఈ టైటిల్‌ పెట్టుకున్నాను. ‘రాజా విక్రమార్క’ సక్సెస్‌ అయితే ఈ సినిమా డైరెక్టర్ తో మరో సినిమా చేయాలని ఉంది. ఈ సినిమా సక్సెస్‌ నా కెరీర్‌కు ప్లస్‌ అవ్వడమే కాదు, నా మీద నాకు ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇస్తుంది. ఈ నెల 21న లోహితతో నా పెళ్లి జరుగబోతుంది అని అన్నారు.