boAt Rockerz 378 Neckband : రూ. 1299లకే కొత్త స్మార్ట్ నెక్‌బ్యాండ్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇప్పుడే కొనేసుకోండి!

boAt Rockerz 378 neckband : హోంగ్రోన్ టెక్ బ్రాండ్మార్కెట్‌లో రూ.1300 లోపు కొత్త స్మార్ట్ నెక్‌బ్యాండ్‌ను లాంచ్ చేసింది. నెక్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ.. boAt Rockerz 378ని ప్రారంభించింది. బడ్జెట్ నెక్‌బ్యాండ్ సరసమైన ధరతో వస్తుంది.

boAt Rockerz 378 Neckband : రూ. 1299లకే కొత్త స్మార్ట్ నెక్‌బ్యాండ్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ఇప్పుడే కొనేసుకోండి!

boAt Rockerz 378 neckband launched with over 1-day battery life at a price tag of Rs 1299

boAt Rockerz 378 neckband : హోంగ్రోన్ టెక్ బ్రాండ్మార్కెట్‌లో రూ.1300 లోపు కొత్త స్మార్ట్ నెక్‌బ్యాండ్‌ను లాంచ్ చేసింది. నెక్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ.. boAt Rockerz 378ని ప్రారంభించింది. బడ్జెట్ నెక్‌బ్యాండ్ సరసమైన ధరతో వస్తుంది. 200mAh బ్యాటరీతో రన్ అయ్యే 25-గంటల బ్యాటరీ లైఫ్, 3D స్పేషియల్ బయోనిక్ సౌండ్‌తో కూడిన అకౌస్టిక్ సౌండ్‌తో సహా అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. గతంలో, boAt భారత మార్కెట్లో boAT Rockerz 330 ప్రోని రూ. 1,499 ధరతో రిలీజ్ చేసింది. కొత్త Rockerz 378తో మంచి సౌండింగ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు కోరుకునే యూజర్లు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ నెక్‌బ్యాండ్‌ల ఆఫర్‌ను విస్తరిస్తోంది. బోట్ రాకర్జ్ 378 ధర, స్పెసిఫికేషన్‌లను పరిశీలిద్దాం.

BoAt Rockerz 378 ధర ఎంతంటే? :
బోట్ Rockerz 378 సరసమైన ధర రూ. 1,299 వద్ద రిలీజ్ అయింది. నెక్‌బ్యాండ్ బ్లాక్, బ్రైట్ బ్లూ, లైట్ బ్లూ, రెడ్ వంటి వివిధ కలర్ ఆప్షన్లలో సేల్ అందుబాటులో ఉంది. నెక్‌బ్యాండ్‌ను boAt-lifestyle.com, Flipkart, Amazon Indiaతో పాటు అధికారిక boAt వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Oppo Reno 8T Launch : ఒప్పో నుంచి ప్రీమియం 5G ఫోన్ వస్తోంది.. ధర, ఫీచర్లు లీక్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

BoAt Rockerz 378 స్పెసిఫికేషన్లు ఇవే :
బోట్ Rockerz 378 ముఖ్యాంశాలలో ఒకటి. భారీ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. boAt ఫుల్ ఛార్జ్‌తో 25 గంటల బ్యాటరీ లైఫ్ అందించుంది. 10 నిమిషాల ఛార్జ్‌తో 15 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుందని పేర్కొంది. BoAt Rockerz 200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో దాదాపు 30 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్‌ను అందిస్తుంది. నెక్‌బ్యాండ్‌లో 3D స్పేషియల్ బయోనిక్ సౌండ్‌తో 10mm డైనమిక్ డ్రైవర్‌లు ఉన్నాయి. క్వాలిటీ కోసం THX ద్వారా ట్యూన్ చేసింది.

boAt Rockerz 378 neckband launched with over 1-day battery life at a price tag of Rs 1299

boAt Rockerz 378 neckband launched with over 1-day battery life

కొత్త అకౌస్టిక్ టెక్నాలజీ 3D స్పేషియల్ బయోనిక్ సౌండ్ 3-డైమెన్షనల్ రియలిస్టిక్ ఆడియో, పొజిషనల్ కచ్చితత్వాన్ని అందిస్తుందని boAt పేర్కొంది. ఆడియో లేటెన్సీని కేవలం 65msకి తగ్గిస్తుందని తెలిపింది. ఇయర్‌బడ్‌ మ్యూజిక్ ఎక్స్‌పీరియన్స్ పొందాలంటే డీప్ బాస్‌ను కలిగిన కంపెనీ ‘సిగ్నేచర్ సౌండ్’ని కూడా అందిస్తాయి. ఈ డివైజ్ బ్లూటూత్ V5.1కి సపోర్టుతో వస్తుంది. వేగవంతమైన కనెక్టివిటీని కలిగి ఉండనుంది.

boAT Rockerz 378 వాటర్, స్పెట్ నిరోధకత IPX5 రేట్ అయింది. మాగ్నెటిక్ ఇయర్‌బడ్స్‌తో వస్తుంది. బ్యాండ్ మ్యూజిక్ నుంచి గేమింగ్‌కి స్విచ్‌ని ఎనేబుల్ చేయవచ్చు. క్విక్-స్విచ్ బటన్‌ను కూడా కలిగి ఉంది. boAT Rockerz 378 వాయిస్ ఆదేశాలకు Google లేదా Siriతో వాయిస్ అసిస్టెంట్‌లకు కూడా సపోర్టు ఇస్తుంది. వాయిస్ కమాండ్ సపోర్ట్ ద్వారా యూజర్లు లేటెస్ట్ న్యూస్, వేదర్ అప్‌డేట్‌ తెలుసుకోవచ్చు. బటన్‌ను ట్యాప్ చేయడం ద్వారా క్రికెట్ స్కోర్‌ అప్‌డేట్స్ కూడా తెలుసుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel New Prepaid Plans : ఎయిర్‌టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. బల్క్ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు..!