Aryan Khan: ఒకవైపు పాపం పిల్లాడనే సింపతీ.. మరోవైపు సెటైర్లు!

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారూఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో బాలీవుడ్ రెండుగా చీలిపోయింది. కొంత మంది చిన్న పిల్లాడు పాపం అని సింపతీ చూపిస్తుంటే.. మరికొంత మంది మాత్రం..

Aryan Khan: ఒకవైపు పాపం పిల్లాడనే సింపతీ.. మరోవైపు సెటైర్లు!

Mumbai Drugs Case Court Rejects Bail Plea Of Aryan Khan

Aryan Khan: బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారూఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో బాలీవుడ్ రెండుగా చీలిపోయింది. కొంత మంది చిన్న పిల్లాడు పాపం అని సింపతీ చూపిస్తుంటే.. మరికొంత మంది మాత్రం.. 23 ఏళ్లవాడ్ని చిన్నపిల్లోడు అంటారా అంటూ సెటైర్లేస్తున్నారు.

Prabhas: రెబల్ స్టార్ సినిమాల లైనప్.. సాహో అనాల్సిందే!

షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఒక్క రోజు కస్టడీ కాస్తా.. 14 రోజుల కస్టడీకి వెళ్లింది. కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో షారూఖ్ ఖాన్ కి మేమున్నాం అంటూ సపోర్ట్ చేస్తున్న వాళ్లు కొంతమందైతే.. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఆర్యన్ కి అగెనెస్ట్ గా మాట్లాడుతున్నారు కొంతమంది. ఇలా షారూఖ్ విషయంలో బాలీవుడ్ రెండుగా చీలిపోయింది.

Rashi Khanna: సెగలు రేపే సొగసుతో రాశీ ఖన్నా రచ్చ!

ఆర్యన్ కేసు విషయంలో బాగా డిస్టర్బ్ అయిన షారూఖ్ ఖాన్ కి స్టార్స్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. భయపడితే ఇంకా భయపెడతారు అంటూ హృతిక్ రోషన్.. చిన్న పిల్లోడ్ని కాస్త ఊపిరి తీసుకోనివ్వండి అంటూ సునీల్ శెట్టి, నిజానిజాలు తెలీకుండా అనవసరంగా ఎవ్వర్నీ తప్పుపట్టకండి అంటూ సోనూసూద్, చిన్న పిల్లోడి భవిష్యత్తుతో రాజకీయాలేంటి అంటూ రవీనా టాండన్ ఈ కేసు మీద షారూఖ్ కి సపోర్ట్ గా నిలిచారు.

Madalsa Sharma: క్యాస్టింగ్ కౌచ్.. అమ్మాయి ఉందంటే చాలు చుట్టూ..

ఈ కేసులో ఫస్ట్ నుంచి షారూఖ్ ఖాన్ కి సపోర్ట్ గానే ఉన్నారు సల్మాన్ ఖాన్. షారూఖ్ కి సపోర్ట్ గా చాలా మంది స్టార్లు నిలుస్తున్నా.. కంగనా రనౌత్ లాంటి ఇంకొంతమంది మాత్రం ..23 ఏళ్ల వాడు చిన్న పిల్లోడు ఎలా అవుతారు..? తప్పు చేశాడు కాబట్టే శిక్ష అనుభవిస్తున్నాడు. బాలీవుడ్ డబ్బు మత్తులో ఉన్న డ్రగ్స్ మాఫియా అంటూ రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. ఇలా షారూఖ్ ఖాన్ కేసులో బాలీవుడ్ రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరి వర్షన్ వారు వినిపిస్తున్నారు.