Jr NTR: తారక్ కోసం బాలీవుడ్ దర్శకుడి చర్చలు.. సెట్టవుతుందా?

ఇప్పుడు మన తెలుగు హీరోల రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే దేశమంతా హవా చూపితే బాలీవుడ్ సినిమాలే ఇతర దేశాలలో ఇండియన్ సినిమా తరపున రిప్రజెంట్ చేసేది.

Jr NTR: తారక్ కోసం బాలీవుడ్ దర్శకుడి చర్చలు.. సెట్టవుతుందా?

Jr Ntr

Jr NTR: ఇప్పుడు మన తెలుగు హీరోల రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే దేశమంతా హవా చూపితే బాలీవుడ్ సినిమాలే ఇతర దేశాలలో ఇండియన్ సినిమా తరపున రిప్రజెంట్ చేసేది. అందుకే ముంబై మేకర్స్ అంతా బాలీవుడ్ చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. టాలీవుడ్ సినిమాలు దేశాన్ని చుట్టేయడమే కాకుండా ఇతర దేశాలలో కూడా మన సినిమాలే హవా చూపిస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఈ ట్రెండ్ పీక్స్ కి చేరుకుంది.

Mallika Sherawat: ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే.. జిల్ అనిపించే అదే హాట్!

అందుకే మన హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి చేరుకుందో ఇప్పటికే మనం చూస్తున్నాం. కాబట్టి ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా బిజీ కావడం గ్యారంటీ. అందుకే సౌత్ టూ నార్త్ దర్శక, నిర్మాతలు ఈ హీరోలతో సినిమాల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే దర్శక దిగ్గజం శంకర్ తో సినిమాకు సిద్దమవగా.. తారక్ చేతిలో మరో రెండు పాన్ ఇండియా స్థాయి సినిమాలు సిద్ధమవుతున్నాయి.

Shahid Kapoor: ప్యాంట్ మర్చిపోయావా.. హీరో భార్య డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్!

కాగా, బాలీవుడ్ సీనియర్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ తో సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి ఎన్నో చారిత్రాత్మక కథలను టచ్ చేసిన సంజయ్ ప్రస్తుతం గంగు భాయ్ కథియావాడి సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నాడు. తన తర్వాత ప్రాజెక్ట్ కోసం సౌత్ హీరోను తీసుకోవాలని చూస్తున్న భన్సాలీ ఆర్ఆర్ఆర్ హీరోలలో ఒకరిని ఎంచుకోవాలనే చూస్తున్నాడట. అందుకే ఆ మధ్య రామ్ చరణ్ తో భన్సాలీ సినిమా అనే ప్రచారం కూడా జరిగింది.

Sree Leela: క‌న్న‌డ భామ‌ల హవా.. శ్రీలీలపై యంగ్ హీరోల చూపు

అయితే, ఏమైందో ఏమో కానీ ఇప్పుడు తారక్ కోసం చర్చలు జరుపుతున్నట్లుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. భన్సాలీ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకోగా ఎందుకో ఆ ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి. అదే సినిమాను ఇప్పుడు ఎన్టీఆర్ తో తెరకెక్కించే ప్రయత్నమని.. కాదు కాదు మరో కొత్త కోసం తారక్ తో చర్చలు అనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. అయితే, ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.