Shahid Kapoor: ప్యాంట్ మర్చిపోయావా.. హీరో భార్య డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్!

సోషల్ మీడియా సూపర్ ఫాస్ట్ యాక్టివ్ గా ఉన్న ఈ కాలంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా డ్రెస్సింగ్ విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. హీరోయిన్స్ హాట్ హాట్ డ్రెస్సులతో..

Shahid Kapoor: ప్యాంట్ మర్చిపోయావా.. హీరో భార్య డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్!

Shahid Kapoor

Updated On : October 24, 2021 / 4:10 PM IST

Shahid Kapoor: సోషల్ మీడియా సూపర్ ఫాస్ట్ యాక్టివ్ గా ఉన్న ఈ కాలంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా డ్రెస్సింగ్ విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. హీరోయిన్స్ హాట్ హాట్ డ్రెస్సులతో కనిపించడం ఈ రోజుల్లో చాలా కామన్ అయినా అప్పుడప్పుడు వాళ్ళని కూడా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అలాంటిది స్టార్ హీరోల భార్యలు ఈ డ్రెస్సింగ్ విషయంలో దొరికితే మాత్రం ఇంకా ట్రోలింగ్ చెప్పలేని విధంగా ఉంటుంది.

Sree Leela: క‌న్న‌డ భామ‌ల హవా.. శ్రీలీలపై యంగ్ హీరోల చూపు

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజపుత్ కూడా ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ విషయంలోనే తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ మధ్యనే షాహిద్ భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్ళాడు. తిరిగి ముంబయి ఎయిర్ పోర్టులో నుండి ఇంటికి వెళ్లే సమయంలో షాహిద్, పిల్లలు డ్రెస్సింగ్ ఫుల్ కవరింగ్ లో ఉండగా.. షాహిద్ భార్య మీరా మాత్రం షార్ట్ లో కనిపించింది. అది కూడా బ్లాక్ డెనిమ్ షార్ట్ కావడంతో పైన ధరించిన డ్రెస్ బ్లాక్ లో కలిసిపోయి అసలు ప్యాంట్ లేదేమో అనిపించేలా ఉంది.

Aha: సంక్రాంతి వరకూ నాన్‌స్టాప్ తెలుగు వినోదాల పండుగ!

దీంతో మీరా ఎయిర్ పోర్టు నుండి వస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నెటిజన్లు ఎవరికి తోచినట్లు వాళ్ళు కామెంట్లతో మోతక్కిస్తున్నారు. ఇప్పుడంటే ఇలా వెళ్ళావ్ కానీ రేపొద్దున ఎన్సీబీ విచారణకు ఇలా వెళ్లకూ మీరా అని.. ఒకప్పుడు సాధారణ మహిళగా పద్ధతిగా ఉండే మీరా ఇప్పుడు స్టార్ హీరోకు భార్య కాగానే షార్ట్స్ వచ్చాయా అని.. పిల్లలకి ఫుల్ కవర్ అయ్యేలా బట్టలేసి నువ్వు మాత్రం ఇలా ఎయిర్ ఫ్రీ వేసుకోడం పాపం కదా మేరా అని ఇష్టారీతిన కామెంట్స్ పెడుతున్నారు. అయితే, మీరా వేసుకున్న షార్ట్స్ ఇప్పుడు బయట కూడా సాధారణమే అయ్యాయని.. దీన్ని కూడా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)