Aryan Bail : షారుఖ్ తనయుడి బెయిల్ కోసం బాధ్యత వహించిన బాలీవుడ్ హీరోయిన్

ఆర్యన్‌కు బెయిల్‌ రావడానికి బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా పూచీకత్తు ఇచ్చింది. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్‌ కోర్టుకు వెళ్ళింది. ఆర్యన్‌ బెయిల్‌కు పూర్తి బాధ్యత

Aryan Bail : షారుఖ్ తనయుడి బెయిల్ కోసం బాధ్యత వహించిన బాలీవుడ్ హీరోయిన్

Juhi Chavla

Aryan Bail :  ఇటీవల డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్ పట్టుబడి జైలులో ఉండటం, కోర్టులో వాదనల అనంతరం తాజాగా ఆర్యన్ కి బెయిల్ రావడం జరిగింది. ఇవాళ ఆర్యన్ జైలు నుంచి బయటకి రానున్నాడు. అయితే ఆర్యన్ బయటకి రావడానికి బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లా పెద్ద రిస్క్ చేసింది. నిన్న ఆర్యన్‌ బెయిల్‌ పటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే బెయిల్‌ పత్రాలు ఆర్యన్‌ ఉన్న జైలుకు పంపించాలంటే షూరిటీ సంతకాలు చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఆర్యన్‌ తరపున చట్టపరమైన బాధ్యత తీసుకుంటూ ప్రముఖ వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.

Bigg Boss 5 : వరస్ట్ పర్ఫార్మర్‌గా సన్నీ.. జైలుకి పంపిన బిగ్ బాస్

ఆర్యన్‌కు బెయిల్‌ రావడానికి బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ జుహీ చావ్లా పూచీకత్తు ఇచ్చింది. ఇందుకోసం జూహీ చావ్లా ముంబై సెషన్‌ కోర్టుకు వెళ్ళింది. ఆర్యన్‌ బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్‌ పేపర్లపై సంతకం చేసింది జుహీ. బాండ్‌పై సంతకం చేసిన అనంతరం బయటకు వచ్చిన జూహీ చావ్లా మీడియాతో మాట్లాడింది. జుహీ మీడియాతో.. ఇప్పడు ఆర్యన్‌ బయటకు రావడం ముఖ్యం. అందుకనే ఆర్యన్ కోసం బాండ్ పేపర్ పై సైన్ చేసాను అని తెలిపింది.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై 200 కోట్ల పెట్టుబడులు.. ఇప్పుడు ఆ సినిమాల పరిస్థితి??

ఈ కేసులో ఆర్యన్‌ కి విధించిన శిక్షలో భాగంగా డబ్బు చెల్లించడంలో విఫలమైనా, అతడు కోర్టు ఆదేశాలను ధిక్కరించినా దీనికి జూహీ చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. షారుక్ ఖాన్‌, జూహ్లీ చావ్లా కలిసి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. అంతేకాక వీరిద్దరూ ఇప్పుడు ఐపీఎల్‌ లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) టీంకి ఫ్రాంఛైజీ పార్ట్‌నర్స్‌గా ఉన్నారు. ఆ స్నేహంతోనే షారుఖ్ కోసం జుహీ వచ్చి ఆర్యన్ కి బెయిల్ రావడంలో సహాయపడింది. ఆర్యన్‌ విడుదల అవ్వడం కోసం జూహీ చావ్లా నిజంగా పెద్ద ధైర్యం చేశారని చెప్పాలి.