Bigg Boss 5 : వరస్ట్ పర్ఫార్మర్‌గా సన్నీ.. జైలుకి పంపిన బిగ్ బాస్

ఈ వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ ముగిసే స‌మ‌యానికి కాజ‌ల్‌, స‌న్నీకి మూడేసి ఓట్లు ప‌డ్డాయి. దీంతో కెప్టెన్ షన్ను.. స‌న్నీని వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా చెప్పడానికి ట్రై చేయగా మరోసారి గొడవ

Bigg Boss 5 :  వరస్ట్ పర్ఫార్మర్‌గా సన్నీ.. జైలుకి పంపిన బిగ్ బాస్

Sunny

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. మొన్న నామినేషన్స్ లో ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్ ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో కొట్టుకునే దాకా వెళ్లారు. ఈ టాస్కుల్లో గొడవలు బాగా జరిగాయి. ఈ గొడవలు చల్లారకముందే బిగ్ బాస్ మరోసారి ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టాడు. తాజాగా వరస్ట్ పర్ఫార్మర్ ని ఎన్నుకునే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ సారి ఎలాంటి టాస్క్ లేకుండానే డైరెక్ట్ గా చెప్పమన్నాడు.

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై 200 కోట్ల పెట్టుబడులు.. ఇప్పుడు ఆ సినిమాల పరిస్థితి??

ముందుగా కెప్టెన్ షన్ను.. నీ ఫ్రెండ్స్ వ‌ల్ల నీ గేమ్ క‌నిపించ‌లేదంటూ కాజ‌ల్ ని వరస్ట్ గా పేర్కొన్నాడు. స‌న్నీ.. సంచాల‌కుడిగా ఫెయిల్ అయ్యాడంటూ జెస్సీ పేరు చెప్పాడు. ఇక మాన‌స్ కూడా సంచాల‌కుడిగా స‌రిగా ప‌ని చేయ‌లేద‌ని జెస్సీనే వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా తెలిపాడు. ర‌వి, సిరిలు.. స‌న్నీని వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. యానీ మాస్టర్.. ప్రియాంకను వరస్ట్ అని చెప్పింది. ప్రియాంక సింగ్‌, లోబోలు కలిసి యానీ మాస్ట‌ర్‌ను వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా తెలిపారు. ఇక శ్రీరామ్.. కాజల్ ని, కాజ‌ల్‌.. శ్రీరామ్ ని కోపంతో వరస్ట్ పర్ఫార్మర్ గా చెప్పారు. చివరగా జెస్సీ.. స‌న్నీని వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్ చెప్పడంతో మళ్ళీ వీళ్లిద్ద‌రికీ గొడ‌వైంది.

Kannada Industry : కన్నడ సినీ పరిశ్రమకి శాపంగా మారిన గుండెపోటు..

మొత్తంగా ఈ వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ ముగిసే స‌మ‌యానికి కాజ‌ల్‌, స‌న్నీకి మూడేసి ఓట్లు ప‌డ్డాయి. దీంతో కెప్టెన్ షన్ను.. స‌న్నీని వ‌ర‌స్ట్ ప‌ర్ఫామ‌ర్‌గా చెప్పడానికి ట్రై చేయగా మరోసారి గొడవ జరిగింది. చివ‌ర్లో యానీ.. త‌న ఓటును స‌న్నీకి మార్చ‌డంతో ఇంట్లో అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా స‌న్నీకే 4 ఓట్లు ప‌డ్డాయి. దీంతో బిగ్ బాస్ అత‌డిని జైల్లో వేశారు. అయితే ఇది సన్నీ చేసిన పనుల వల్లే జరిగింది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. గత వారం నుంచి సన్నీ అందరితో గొడవ పెట్టుకుంటున్నాడు. ప్రతి దానికి సీరియస్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ కి వ్యతిరేకంగా మారుతుండటంతో అందరూ సన్నీని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికైనా సన్నీ తన యాటిట్యూడ్ మార్చుకోకపోతే కష్టమే అంటున్నారు ప్రేక్షకులు.