Tara Sutaria : హీరోలకి ఇచ్చేంత రెస్పెక్ట్ హీరోయిన్స్ కి ఇవ్వరు..

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో హీరోయిన్ తారా సుతారియా మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు ఇచ్చే గౌరవంలో తేడా కనిపిస్తూ ఉంటుంది. హీరోలను సర్‌ అని పిలుస్తూ ఉంటారు. అదే మమ్మల్ని మాత్రం..........

Tara Sutaria : హీరోలకి ఇచ్చేంత రెస్పెక్ట్ హీరోయిన్స్ కి ఇవ్వరు..

Tara Sutaria

Tara Sutaria :  సినీ పరిశ్రమలో వాళ్ళ కేటగిరిని బట్టి వాళ్ళకిచ్చే గౌరవం మారిపోతూ ఉంటుంది. ఇది బయటకి ఎవరూ చెప్పకపోయినా అందరికి తెలిసిందే. ఒక్కో డిపార్ట్మెంట్ వాళ్ళని ఒక్కోలా చూస్తారు. తాజాగా ఈ విషయాన్నీ ఓ బాలీవుడ్ హీరోయిన్ మీడియా ముందు మాట్లాడింది. బాలీవుడ్ సినిమా ఏక్ విలన్‌ రిటర్న్స్‌ జూలై 29న విడుదల కానుంది. ఇందులో జాన్‌ అబ్రహం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ, తారా సుతారియా మెయిన్ లీడ్స్ లో నటించారు. త్వరలో రిలీజ్ ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

Prakruti Mishra : హీరోయిన్ పై దాడి చేసిన హీరో భార్య.. నన్ను వేధిస్తుంది అంటూ వాపోయిన హీరోయిన్

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో హీరోయిన్ తారా సుతారియా మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు ఇచ్చే గౌరవంలో తేడా కనిపిస్తూ ఉంటుంది. హీరోలను సర్‌ అని పిలుస్తూ ఉంటారు. అదే మమ్మల్ని మాత్రం పేరు పెట్టి పిలుస్తారు. ఒక్కరని కాదు చాలా మంది అలాగే చేస్తారు. మమ్మల్ని కూడా మేడమ్‌ అని పిలవాలని నేను చెప్పట్లేదు. కానీ మాకు ఇచ్చే మినిమమ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ అబ్బాయి గొప్ప అని చెప్పేలా చేస్తున్నారు” అని తెలిపింది. దీంతో తారా సుతారియా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.