Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు బెదిరింపు

తాజాగా విజ‌య్ ఇంట్లో బాంబ్ పెట్టిన‌ట్టు చెన్నై నగర పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో నీలాంగ‌రై పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో కలిసి విజయ్ ఇంటిని త‌నిఖీ చేశారు.

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు బెదిరింపు

Vijay

Vijay :  త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఇంటికి నిన్న బాంబ్ బెదిరింపు కాల్ వ‌చ్చింది. గ‌తంలో కూడా కొన్ని సార్లు విజయ్ ఇంట్లో బాంబ్ ఉందంటూ రాంగ్ కాల్స్ వచ్చాయి. తాజాగా విజ‌య్ ఇంట్లో బాంబ్ పెట్టిన‌ట్టు చెన్నై నగర పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో నీలాంగ‌రై పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో కలిసి విజయ్ ఇంటిని త‌నిఖీ చేశారు. బాంబు లేక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకొని అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు.

Bigg Boss Jessy : బిగ్ బాస్‌లో 10 వారాలకు జెస్సి పారితోషకం ఎంతో తెలుసా??

దీంతో మరోసారి ఇది కూడా ఫేక్ కాల్ అని అర్థమైంది పోలీసులకి. దీంతో ఈ కాల్ ఎవరు చేసారో ట్రేస్ చేశారు. విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి చెందిన భువనేశ్వర్‌ అనే ఓ యువకుడు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి విజయ్ ఇంట్లో బాంబు ఉందని చెప్పినట్లు తెల్సింది. అయితే అతన్ని, చుట్టు పక్కల వాళ్ళని విచారించగా ఆ యువకుడికి మతిస్థిమితం లేదని తెలిపారు. కానీ అతను గతంలో కూడా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల ఇళ్లల్లో బాంబు ఉన్నట్లు ఫోన్‌ చేసి చెప్పినట్లు గుర్తించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.