Bommarillu Bhaskar : మళ్ళీ మెగా కాంపౌండ్ లోకి బొమ్మరిల్లు భాస్కర్.. మెగా హీరోతో సినిమా??

ఇప్పుడు భాస్కర్ నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ అక్కినేనికి కెరీర్‌లో మొదటి విజయం అందించాడు భాస్కర్.

Bommarillu Bhaskar : మళ్ళీ మెగా కాంపౌండ్ లోకి బొమ్మరిల్లు భాస్కర్.. మెగా హీరోతో సినిమా??

Bommarillu Bhaskar

Bommarillu Bhaskar :  ‘బొమ్మ‌రిల్లు’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సాధించాడు. ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ‘ప‌రుగు’ సినిమా చేశాడు. ఇది యావరేజ్ గా నిలిచింది. ఆ త‌ర్వాత ‘ఆరెంజ్‌’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలు నిరాశని మిగిల్చాయి. త‌మిళంలో ‘బెంగ‌ళూరు నాట్క‌ల్’ అని ఓ సినిమా తీశాడు. అది కూడా అనుకున్నంతగా విజయం సాధించలేదు. భాస్కర్ కి దాదాపు 12 సంవత్సరాలైంది విజయం చూసి. మళ్ళీ ఇన్ని సంవ‌త్స‌రాల‌ తర్వాత 2021లో అఖిల్ అక్కినేని హీరోగా వ‌చ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో విజయం అందుకొన్నాడు. దీంతో తన కెరీర్ మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

Lavanya Tripathi : నిన్న నివేదా.. నేడు లావణ్య.. పర్వతాలను ఎక్కేస్తున్న హీరోయిన్స్

ఇప్పుడు భాస్కర్ నెక్స్ట్ సినిమా ఎవరితో ప్లాన్ చేస్తున్నాడు అని ఇండస్ట్రీలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ అక్కినేనికి కెరీర్‌లో మొదటి విజయం అందించాడు భాస్కర్. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’ సినిమా తర్వాత బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌ కోసం నిర్మాతలు వస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా భాస్కర్ మళ్ళీ మెగా కాంపౌండ్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేశాడు భాస్క‌ర్‌ . ఇప్పుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేయడానికి కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.

Bigg Boss 5 : బిగ్ బాస్ శ్రీరామచంద్ర కోసం మొన్న హీరోయిన్.. ఇవాళ బాలీవుడ్ కమెడియన్

‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఇటీవల ‘కొండపొలం’ సినిమాతో మన ముందుకి వచ్చాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం వైష్ణవ్ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నట్టు సమాచారం. భాస్కర్ మరోసారి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ కథని సిద్ధం చేసి వైష్ణవ్ కి వినిపించే పనిలో ఉన్నాడని సమాచారం. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే భాస్కర్ కెరీర్ మళ్ళీ గాడిలో పడినట్టే అని భావిస్తున్నారు.