RAPO20: బోయపాటి స్కెచ్.. ఉస్తాద్ హీరో కోసం బాలీవుడ్ భామ?

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బోయపాటి ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ తో సినిమా చేయనున్నాడు. రామ్ కెరీర్ లో 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తున్న

RAPO20: బోయపాటి స్కెచ్.. ఉస్తాద్ హీరో కోసం బాలీవుడ్ భామ?

Rapo20

RAPO20: అఖండ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు బోయపాటి ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ తో సినిమా చేయనున్నాడు. రామ్ కెరీర్ లో 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తున్నాడు. కాగా.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. రామ్ కెరీర్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఇదే కానుంది. అందుకోసమే బోయపాటి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.

RAPO20: ఉస్తాద్ హీరోతో బోయపాటి కన్ఫర్మ్.. పాన్ ఇండియా రేంజ్!

రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ కి సౌత్ ఎలాగూ క్రేజ్ పెరగడం ఖాయం. తర్వాత బోయపాటితో చేసే సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు కనుక బాలీవుడ్ మార్కెట్ పట్టుకోవడం ఇంపార్టెంట్. అందుకే మేకర్స్ ఈ సినిమా కోసం బాలీవుడ్ భామని వెతికేపనిలో ఉన్నారట. ఇప్ప‌టికే బోయ‌పాటి ప‌రిణితి చోప్పాను సంప్ర‌దించగా, ఆమెకు క‌థ న‌చ్చ‌డంలో పాజిటివ్‌గా స్పందించింద‌ని టాక్ నడుస్తుంది.

RAPO19: రామ్-లింగుస్వామి సినిమా కోసం కన్నడ బ్యూటీ!

పక్కా యాక్షన్ సినిమానే అయినా ఇందులో లవ్ ట్రాక్ కీలకంగా ఉండనుందట. దీని కోసం పరిణితి అయితే రామ్ కి జోడీగా బావుండడంతో పాటు బాలీవుడ్ మార్కెట్ లో క్రేజ్ దక్కుతుందని ప్లాన్ చేస్తున్నారు. పరిణితీతో పాటు సౌత్ నుండి కూడా మరో ఇద్దరు నటులను తీసుకొనే ప్రాసెస్ లో ఉన్నారట మేకర్స్. అదే నిజమైతే రామ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా భారీ స్థాయికి వెళ్లడం ఖాయంగా భావిస్తున్నారు. షూటింగ్ మొదలైతే కానీ.. పూర్తి వివరాలు తెలియవు.