RAPO20: ఉస్తాద్ హీరోతో బోయపాటి కన్ఫర్మ్.. పాన్ ఇండియా రేంజ్!

దర్శకుడు బోయపాటి అఖండ బ్లాక్ బస్టర్ సినిమాతో మరోసారి ఊరమస్ జాతర కొనసాగించాడు. అంచనాలకి మించి అఖండని ప్యాక్ చేయడంలో బోయపాటి నూటికి వెయ్యిశాతం సక్సెస్ కాగా.. బోయపాటి ఇప్పుడు

RAPO20: ఉస్తాద్ హీరోతో బోయపాటి కన్ఫర్మ్.. పాన్ ఇండియా రేంజ్!

Rapo20

RAPO20: దర్శకుడు బోయపాటి అఖండ బ్లాక్ బస్టర్ సినిమాతో మరోసారి ఊరమస్ జాతర కొనసాగించాడు. అంచనాలకి మించి అఖండని ప్యాక్ చేయడంలో బోయపాటి నూటికి వెయ్యిశాతం సక్సెస్ కాగా.. బోయపాటి ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ తో సినిమాను ప్రకటించాడు. రామ్ కెరీర్ లో 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తున్నాడు. కాగా.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. రామ్ కెరీర్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఇదే కానుంది.

Bachchhan Paandey Trailer: ఒంటికన్నుతో అక్షయ్ అరాచకం.. కామెడీ విత్ యాక్షన్!

నిజానికి బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. గతంలో సరైనోడు కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే.. అల్లు అర్జున్ పుష్ప ఊహించిన దానికంటే భారీ సక్సెస్ కావడంతో ఈ వేడిలో పుష్ప రెండో పార్ట్ కూడా పూర్తి చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. దీంతో మరో ఏడాది పుష్ప రెండో పార్టీ పూర్తయ్యే వరకు బన్నీ మేకోవర్ అలాగే ఉండాలి. అందుకే బోయపాటి ఇప్పుడు యంగ్ హీరో రామ్ పోతినేనితో ఓ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్తున్నాడు.

Release Clash: పవన్ కటౌట్ చూసి కూడా వెనకాడని శర్వా.. స్ట్రాటజీ ఏంటి?

ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పుడో ప్రచారం మొదలైంది. అయితే.. ఇప్పుడు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో వారియర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాగా ఇది ద్విభాషా సినిమా. లింగుస్వామి దర్శకత్వంలో ఉస్తాద్ హీరో ఎలా కనిపించనున్నాడన్నది ఆసక్తిగా మారగా.. బోయపాటి రామ్ ను చూపించనున్నాడన్నది ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది.