Release Clash: పవన్ కటౌట్ చూసి కూడా వెనకాడని శర్వా.. స్ట్రాటజీ ఏంటి?

సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో శర్వానంద్.. ఆల్రెడీ హిట్ రేస్ లో ఉన్న హీరోయిన్ రష్మికా.. ఇద్దరూ కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో గ్రాఫ్ పెంచుకుందామనుకున్నారు. కానీ తీరా..

Release Clash: పవన్ కటౌట్ చూసి కూడా వెనకాడని శర్వా.. స్ట్రాటజీ ఏంటి?

Release Clash

Release Clash: సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో శర్వానంద్.. ఆల్రెడీ హిట్ రేస్ లో ఉన్న హీరోయిన్ రష్మికా.. ఇద్దరూ కలిసి ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో గ్రాఫ్ పెంచుకుందామనుకున్నారు. కానీ తీరా రిలీజ్ డేట్ ప్రకటించాక భీమ్లానాయక్ తో పవర్ స్టార్ కూడా తగ్గేదే లే అన్నారు. పోనీ శర్వానే వెనక్కి వెళ్తాడనుకుంటే ఫిబ్రవరి 25న వచ్చేయడం పక్కా అని ధీమాగా చెప్పారు మేకర్స్.

Ram Charan: నా గురించి నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు.. తల్లికి చెర్రీ విషెష్!

భీమ్లానాయక్ రెండు రిలీజ్ డేట్లను బ్లాక్ చేశాడు.. మరోవైపు సింగర్ కైలాష్ ఖేర్ భీమ్లా కోసం అడిషనల్ సాంగ్ చేస్తున్నాడు. దీంతో పవర్ స్టార్ థియేటర్స్ లో దిగేది ఏప్రిల్ 1కే అని ఫిక్సయ్యారు శర్వానంద్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలు. ధైర్యంగా ఆడవాళ్లు మీకు జోహార్లు, గని సినిమాలు ఫిబ్రవరి 25న వచ్చేస్తాయని ప్రకటించారు. అయితే రాత్రికి రాత్రే ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ రావడం పక్కా అని తేల్చేసి ఈ యంగ్ హీరోలకు షాకిచ్చాడు. గని టీమ్ డైలమాలో పడినా, శర్వానంద్ మాత్రం ధైర్యంగా భీమ్లానాయక్ తో పోటీకి దిగడం ఇప్పుడందరికీ షాకిస్తుంది.

Thalaivar169: మరోసారి రజినీతో ఐష్.. రోబో లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందా?

సాలిడ్ సక్సెస్ కోసం చూస్తున్న శర్వానంద్.. వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్తోన్న రష్మిక కాంబినేషన్లో వస్తోన్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. లేటెస్ట్ గా శర్వానంద్, రష్మిక డబ్బింగ్ ఫినిష్ చేశారు. ఈ సందర్భంగా మరోసారి ఫిబ్రవరి 25న రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 19న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు కూడా చెప్పేశారు. హైస్వింగ్ లో ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు.

Movie Releases: ప్చ్.. ఈ వారం కూడా సందడి లేని థియేటర్లు!

ఈమధ్యే మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన దేవిశ్రీప్రసాద్ ట్యూన్స్ ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. రష్మికా ఉండనే ఉంది. ఆమెకు తోడు రాధిక, కుష్బూ లాంటి సీనియర్ హీరోయిన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల కంటెంట్ ఆకట్టుకుంటుందనే నమ్మకమూ ఉంది. ఆల్రెడీ రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ కి మంచి రెస్పాన్సే వచ్చింది. సో లిమిటెడ్ బడ్జెట్, కలర్ ఫుల్ ఫామిలీ ఎంటర్ టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఏ టైమ్ లో రిలీజ్ చేసినా మినిమమ్ గ్యారెంటీ. కాస్త ఆడియన్స్ కు కనెక్ట్ అయితే సినిమా హిట్టే అన్న స్ట్రాటజీ నిర్మాతలది. అందుకే భీమ్లానాయక్ లాంటి భారీ కటౌట్ కనిపిస్తున్నా.. వెనకాడటం లేదు శర్వానంద్.