Movie Releases: ప్చ్.. ఈ వారం కూడా సందడి లేని థియేటర్లు!

ఈమధ్య రిలీజ్ ల కోసం పోటీపడి వరసగా ధియేటర్లోకొచ్చిన సినిమాలు ఈ వీక్ కాస్త రిలాక్స్ అయ్యాయి. మోహన్ బాబు మూవీతో పాటూ ఏవో కొన్ని సినిమాలు తప్పించి పెద్దగా సినిమాల మధ్య పోటీ లేదు.

Movie Releases: ప్చ్.. ఈ వారం కూడా సందడి లేని థియేటర్లు!

Movie Releases

Updated On : February 18, 2022 / 3:58 PM IST

Movie Releases: ఈమధ్య రిలీజ్ ల కోసం పోటీపడి వరసగా ధియేటర్లోకొచ్చిన సినిమాలు ఈ వీక్ కాస్త రిలాక్స్ అయ్యాయి. మోహన్ బాబు మూవీతో పాటూ ఏవో కొన్ని సినిమాలు తప్పించి పెద్దగా సినిమాల మధ్య పోటీ లేదు. పైగా యంగ్ హీరోలతో పాటూ పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ ఫిబ్రవరి 24 తర్వాతే కన్నేశారు. సో వచ్చే వారానికి సిద్ధకండంటూ ఈ వారం కాస్త రిలాక్సేషన్ ఇచ్చినట్టుంది టాలీవుడ్.

NBK107: బాబు రెడీ.. యాక్షన్ మొదలుపెట్టిన బాలయ్య!

స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కు రెడీగా లేకపోవడంతో ఈ వారం ధియేటర్లో రిలీజ్ సందడి కాస్త తక్కువే కనిపిస్తుంది. ఈ వారానికి గాను ఫిబ్రవరి 18న సీనియర్ హీరో సినిమా సన్ ఆఫ్ ఇండియా తప్పించి.. పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. మోహన్ బాబు చాలా కాలం తర్వాత సోలో పర్ ఫామెన్స్ తో పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో చేస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమా ఈ శుక్రవారం ధియేటర్లోకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ మూవీ రెడీ అయింది.

Bheemla Nayak: పవన్ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన యంగ్ హీరోలు?

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా వర్జిన్ స్టోరీ సైతం ఈ ప్రైడే రిలీజ్ అయింది. ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ తనయుడు సహదేవ్ ఈ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీతో పాటూ ఈ వారం థియేటర్స్ ను టార్గెట్ చేసిన మూవీ విశ్వక్. ఎన్నారై యూత్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన విశ్వక్ సినిమాతో డైరెక్టర్ గా వేణు ముల్కాకా.. హీరోగా అజయ్ కతుర్వార్ పరిచయమయ్యాడు.