NBK107: బాబు రెడీ.. యాక్షన్ మొదలుపెట్టిన బాలయ్య!

ఈమధ్యనే దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. అఖండ షూటింగ్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్..

NBK107: బాబు రెడీ.. యాక్షన్ మొదలుపెట్టిన బాలయ్య!

Nbk107

NBK107: ఈమధ్యనే దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. అఖండ షూటింగ్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా ఖరారు చేసుకున్న బాలయ్య ఆ మధ్య ఆ సినిమాకు ముహూర్తం కూడా పెట్టేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా శృతి హాసన్ బాలయ్యకి జోడీగా నటిస్తుంది. అఖండ సినిమా సక్సెస్ కీలకమైన థమన్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

Bheemla Nayak: పవన్ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన యంగ్ హీరోలు?

ఆ మధ్య ముహూర్తం కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ సినిమా నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఫిబ్రవరి 18న తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇది సినిమాకి కీలకమైన షెడ్యూల్ కాగా.. ఈ షెడ్యూల్ తో స్టార్ట్ చేశారట. రాయలసీమ, కర్ణాటక బోర్డర్ లో జరిగే ఫ్యాక్షన్ కథతో ఈ సినిమాని తీయబోతున్నట్టు సమాచారం కాగా.. కర్ణాటక బోర్డర్ తో సంబంధం ఉన్న సినిమా కాబట్టి కన్నడలో కూడా ఈ సినిమాని మార్కెట్ చేయాలనుకుంటున్నారు చిత్ర యూనిట్.

Khushi : 21 ఏళ్ళ తర్వాత.. ఖుషి సాంగ్‌కి డ్యాన్స్ వేసిన భూమిక.. వైరల్ అవుతున్న వీడియో

అందుకోసమే కన్నడలో హీరోగా ఊర మాస్ సినిమాలు చేసే దునియా విజయ్ ని ఈ సినిమా కోసం విలన్ గా ఎంపిక చేశారు. చరిత్రలో ఒక కీలక పాయింట్ ద్వారా కథను అల్లుకొని గోపీచంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం సాలిడ్ కథ సిద్ధం చేయగా.. ఇది పక్కా బాలయ్య మార్క్ సినిమాగా.. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. దునియా విజయ్ లాంటి నటుడిని ఎంపిక చేసుకోవడం కూడా యాక్షన్ మూవీగా మార్చేందుకేనని వినిపిస్తుంది. అదే నిజమైతే బాలయ్య అభిమానులకు ఇది కూడా మరో పండగే.