Rishabh Pant : లక్నో కెప్టెన్సీకి రాజీనామా చేసిన రిషబ్ పంత్.. సోషల్ మీడియాలో ఫ్రాంఛైజీ కీలక ప్రకటన..
Rishabh Pant Resigns LSG: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్ (Rishabh Pant) తప్పుకున్నాడు.
Rishabh Pant Resigns As Lucknow Super Giants Skipper
- ఐపీఎల్ 2026లో పేలవ ప్రదర్శన
- లక్నో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న రిషబ్ పంత్
Rishabh Pant : లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషబ్ పంత్ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని లక్నో టీమ్ తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన చేసింది. ప్లేఆఫ్స్‌కు చేరకుండానే నిష్ర్కమించింది. పంత్ నాయకత్వంలో లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడగా నాలుగు అంటే నాలుగే మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో ఈ సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలో పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించి ఆ విషయాన్ని ఫ్రాంఛైజీకి తెలుపగా.. వారు అతడి నిర్ణయాన్ని గౌరవించారు.
*Hardik Pandya : ఐపీఎల్ నుంచి ఔట్.. గర్ల్‌ఫ్రెండ్‌తో ఫ్రాన్స్‌కి వెకెషన్‌కు వెళ్లిన పాండ్యా!
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని పంత్ నిర్ణయం తీసుకున్నాడు. అతడి అభ్యర్థనను ఫ్రాంఛైజీ మర్యాదపూర్వకంగా అంగీకరించింది. వెంటనే నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. నాయకుడిగా పంత్ గొప్ప సేవలు అందించాడు. అని లక్నో ఫ్రాంఛైజీ తెలిపింది.
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు పంత్ ను లక్నో జట్టు వేలంలో 27 కోట్లకు దక్కించుకుని నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో పంత్ సారథ్యంలో బరిలోకి దిగిన లక్నో ఆశించిన స్థాయిలో రాణించలేదు. అతడి నాయకత్వంలో రెండు సీజన్లలో కలిపి లక్నో జట్టు కేవలం 10 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ పంత్ విఫలం అయ్యాడు.
*Vaibhav Sooryavanshi : క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు ముందు.. గుజరాత్‌కు వైభవ్ సూర్యవంశీ మెసేజ్..
Official announcement. pic.twitter.com/7WeOwpkDr6
— Lucknow Super Giants (@LucknowIPL) May 29, 2026
