Samsung Galaxy A26 5G : మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy A26 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారు ఈ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 5వేలు తగ్గింపుతో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎ26 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy A26 5G : శాంసంగ్ లవర్స్ పండగ చేస్కోండి. మీరు శాంసంగ్ గెలాక్సీ A26 5జీ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ ఆఫర్ మీకోసమే. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్లతో శాంసంగ్ గెలాక్సీ A26 5జీ ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, అదనపు సేవింగ్ అందిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ A26 5జీపై డీల్స్, ఆఫర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

శాంసంగ్ గెలాక్సీ A26 5జీ ధర, ఆఫర్లు :
మార్చి 2024లో శాంసంగ్ గెలాక్సీ A26 5జీ ఫోన్ లాంచ్ అయింది. 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 24,999 ధర నుంచి తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,050 సేవ్ చేయొచ్చు. తద్వారా ధర రూ. 19,949కి తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్, మార్చిలో లాంచ్ ధర కన్నా రూ. 5వేలు తక్కువకే లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A26 5జీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A26 5జీ ఫోన్ 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ ఇన్ఫినిటీ-యూ, సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 7పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-సీ పోర్ట్, NFC ఉన్నాయి.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ A26 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP మాక్రో కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా, ఈ ఫోన్ 164 మిమీ పొడవు, 77.5 మిమీ వెడల్పు, 7.7 మిమీ మందం, 200 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP67 రేటింగ్‌తో వస్తుంది.
