Boat Smartwatches : వావ్.. బడ్జెట్ ఫ్రెండ్లీగా బోట్ 2 కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. హెల్త్, ఫిట్నెస్ ఫీచర్లు అదిరిపోయాయ్!
Boat Smartwatches : బోట్ కొత్త స్మార్ట్‌వాచ్‌లైన బోట్ స్టార్మ్ కాల్ 4, బోట్ అల్టిమా వోగ్ 2 స్మార్ట్‌వాచ్‌లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Boat Smartwatches
- బోట్ స్టార్మ్ కాల్ 4 1.96-అంగుళాల HD డిస్ప్లే
- బోట్ అల్టిమా వోగ్ 2 వాచ్ 1.96-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే
- బ్యాటరీ 12 రోజుల వరకు బ్యాకప్, జూన్ 12న అధికారిక సేల్స్
Boat Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా? బోట్ స్మార్ట్‌వాచ్ యూజర్ల కోసం భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి. బోట్ స్టార్మ్ కాల్ 4, బోట్ అల్టిమా వోగ్ 2 స్మార్ట్‌వాచ్‌లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఇందులో బోట్ స్టార్మ్ కాల్ 4లో 1.96-అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఉండగా, అల్టిమా వోగ్ 2లో 1.96-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లలో 100కు పైగా స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. బోట్ స్టార్మ్ కాల్ 4, బోట్ అల్టిమా వోగ్ 2 ఫీచర్లు స్పెసిఫికేషన్లు, ధరలకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
బోట్ స్టార్మ్ కాల్ 4, బోట్ అల్టిమా వోగ్ 2 ధర :
బోట్ స్టార్మ్ కాల్ 4 వాచ్ ధర రూ. 1,599 కాగా, బోట్ అల్టిమా వోగ్ 2 ధర రూ. 2,799గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ల కోసం ప్రీ-బుకింగ్‌లు మే 29న బోట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కాగా, అధికారిక సేల్స్ జూన్ 12న కంపెనీ వెబ్సైట్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభమవుతాయి.
బోట్ స్టార్మ్ కాల్ 4 స్పెసిఫికేషన్లు :
బోట్ స్టార్మ్ కాల్ 4 వాచ్‌లో 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 1.96-అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఉంది. ఈ వాచ్ డస్ట్, స్పెట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ కాలింగ్ ఎమర్జెన్సీ SOS సపోర్ట్ ఉన్నాయి. ఈ వాచ్ సింగిల్ ఛార్జ్‌పై 12 రోజుల వరకు వస్తుంది. డైరెక్ట్ యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్ 100కి పైగా స్పోర్ట్స్ మోడ్లకు సపోర్ట్ చేస్తుంది. హెల్త్ ఫీచర్లలో హార్ట్ రెస్పాన్స్ రేటు, SpO2, స్లీప్ స్ట్రెస్ మానిటరింగ్ ఉన్నాయి. మహిళల వెల్నెస్ ట్రాకింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. స్టార్మ్ కాల్ వాచ్ 4 రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది. ఇందులో నావిగేషన్ కోసం ఫంక్షనల్ క్రౌన్ కూడా ఉంది.
బోట్ అల్టిమా వోగ్ 2 స్పెసిఫికేషన్లు :
బోట్ అల్టిమా వోగ్ 2 స్మార్ట్‌వాచ్ 1000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ అందించే 1.96-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. మెటాలిక్ ఫ్రేమ్ డిజైన్ ఉండే ఈ వాచ్ డైరెక్ట్ యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. డస్ట్, స్వెట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ కాలింగ్ ఎమర్జెన్సీ SOS సపోర్ట్ ఉన్నాయి. బ్యాటరీ 10 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది.
ఈ స్మార్ట్‌వాచ్ 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‌తో వస్తుంది. హెల్త్ ఫీచర్లలో హార్ట్ మానిటరింగ్ రేటు, SpO2, స్లీప్ స్ట్రెస్ మానిటరింగ్ పాటు మహిళల హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. అల్టిమా వోగ్ 2 ప్రీమియం క్వాలిటీతో వస్తుంది. మెటల్ ఫ్రేమ్, మంచి వ్యూ కోసం మోడ్రాన్ డిస్ప్లే కూడా ఉంది.
