Bheemla Nayak: పవన్ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన యంగ్ హీరోలు?

గట్టిగా వారం రోజులలోనే థియేటర్ల భీమ్లా నాయక్ గర్జన మొదలవుతుంది. సెకండ్ లాక్ డౌన్ నుండి పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. భీమ్లా నాయక్ తో వాళ్ళ ఆశ తీరబోతుంది.

Bheemla Nayak: పవన్ ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన యంగ్ హీరోలు?

Pawan Kalyan

Bheemla Nayak: గట్టిగా వారం రోజులలోనే థియేటర్ల భీమ్లా నాయక్ గర్జన మొదలవుతుంది. సెకండ్ లాక్ డౌన్ నుండి పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. భీమ్లా నాయక్ తో వాళ్ళ ఆశ తీరబోతుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన భీమ్లా నాయక్ ఈసారి వెనక్కి తగ్గే ఛాన్స్ లేనేలేదని మేకర్స్ ధీమాగా చెప్తున్నారు. ముందు భీమ్లా నాయక్ కోసం రెండు డేట్స్ ఇచ్చిన దర్శక, నిర్మతలు మొదటి డేట్ ఫిబ్రవరి 25కే ఫిక్సయ్యారు. ఆ వచ్చినపుడులే అన్నట్లు అదే డేట్ మరో ఇద్దరు యంగ్ హీరోలు ప్రకటించారు.

Samantha : ఎయిర్ పోర్ట్‌లో అర్ధరాత్రి .. పూజా పాటకి సమంత డ్యాన్స్..

మెగా కాంపౌండ్ నుండే వరుణ్ తేజ్ గని సినిమాని ఫిబ్రవరి 25నే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించగా మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా అదే డేట్ లాక్ చేసుకున్నాడు. అయితే.. భీమ్లా నాయక్ అదే డేట్ ప్రకటించడంతో గొంతులో వెలక్కాయ పడ్డ పరిస్థితిలో ఉన్నారు. గని దాదాపుగా వెనక్కు తగ్గడం కన్ఫర్మ్ అని అనుకుంటుండగా మేకర్స్ అయితే ఇంకా ప్రకటించలేదు. మెగా హీరోలే కాబట్టి గని ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. ఇక శర్వా ఆడవాళ్ళూ మీకు జోహార్లు మాత్రం వెనక్కు తగ్గేది లేదు వచ్చేస్తాం అంటూ ప్రకటనలు అయితే ఇచ్చారు.

Arpita Khan : 10 కోట్లతో లగ్జరీ ప్లాట్‌ని కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ సోదరి

కానీ.. లేటెస్ట్ సమాచారం ప్రకారం శర్వా కూడా వెనక్కు తగ్గినట్లే తెలుస్తుంది. ఓ వారం గ్యాప్ ఇచ్చి తన సినిమాని తీసుకురావాలని ఆడవాళ్లు మీకు జోహార్లు మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మార్చి తొలి వారంలో శర్వా రావాలని చూస్తున్నాడట. మేకర్స్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేకపోగా.. వాయిదా పడడం మాత్రం పక్కా అని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది.