Samantha : ఎయిర్ పోర్ట్‌లో అర్ధరాత్రి .. పూజా పాటకి సమంత డ్యాన్స్..

తాజాగా సమంత కూడా ఈ పాటకి డ్యాన్స్ వేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎక్కడికో ట్రావెల్ చేయడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్లగా అక్కడ ఫ్లైట్ కి ఇంకా టైం ఉండటంతో సరదాగా........

Samantha : ఎయిర్ పోర్ట్‌లో అర్ధరాత్రి .. పూజా పాటకి సమంత డ్యాన్స్..

Samantha

Samantha :  ఇటీవల సోషల్ మీడియాలో చాలా సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో బాగా పాపులర్ అయిన సాంగ్స్ , లేదా చాలా బాగున్న పాటలు, మ్యూజిక్స్ ని షార్ట్ గా కట్ చేసి రీల్స్ రూపంలో వైరల్ చేస్తున్నారు. ఇలా వైరల్ అయిన సాంగ్స్ కి మాములు ప్రజలే కాదు స్టార్లు, సెలబ్రిటీలు సైతం డ్యాన్సులు వేస్తున్నారు. తమ స్టెప్పులతో ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు.

ఇటీవల విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న బీస్ట్ సినిమా నుంచి ‘అరబిక్ కుతు’ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటకి హీరో శివ కార్తికేయన్ లిరిక్స్ అందించగా, అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఈ పాట బాగా ఫేమస్ అయింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో ఈ పాట బాగా వైరల్ అవుతుంది. దీంతో అందరూ ఈ పాటకి రీల్స్ చేస్తున్నారు. స్టార్లు సైతం ఈ పాటకి స్టెప్పులు వేస్తున్నారు.

Aishwarya : ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు.. ధనుష్‌తో విడాకుల తర్వాత మొదటిసారి స్పందించిన ఐశ్వర్య

తాజాగా సమంత కూడా ఈ పాటకి డ్యాన్స్ వేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎక్కడికో ట్రావెల్ చేయడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్లగా అక్కడ ఫ్లైట్ కి ఇంకా టైం ఉండటంతో సరదాగా ఎయిర్ పోర్ట్ లో ఎవరూ లేని ప్లేస్ లో ‘అరబిక్ కుతు’ సాంగ్ కి డ్యాన్స్ వేసింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ”రాత్రి పూట ఫ్లైట్ కోసం చూస్తూ ఈ రిథమ్ కి డ్యాన్స్ చేశాను”అంటూ విజయ్, పూజా హెగ్డే, అనిరుద్.. ఇలా ‘బీస్ట్’ సినిమాకి సంబంధించిన వాళ్ళని ట్యాగ్ చేసింది.

Babli Bouncer : మహిళా బౌన్సర్ పాత్రలో తమన్నా

ఈ వీడియోని పూజా హెగ్డే కూడా తన స్టోరీ లో షేర్ చేయడం విశేషం. సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు సమంత అద్భుతంగా డ్యాన్స్ వేశావంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.