APPGCET 2026 Results: ఏపీ పీజీ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
ఉన్నత విద్య, పరిశోధనలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అటు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు.
APPGCET 2026 Results: ఏపీ పీజీ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. పీజీ సెట్ ఫలితాల్లో 91.55 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు cets.apsche.ap.gov.in/PGCET వెబ్సైట్లో ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సప్ నెంబర్ 95523 00009 ద్వారా ర్యాంకులు పొందే వీలుంది. పీజీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు మంత్రి లోకేశ్. ఉన్నత విద్య, పరిశోధనలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అటు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
* అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx కి వెళ్లాలి.
* కింద ఉన్న AP PGCET 2026 (https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx) పై క్లిక్ చేయాలి.
* Down Load Rank Card పై క్లిక్ చేయాలి.
* అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేటాఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి View Rank Card పై క్లిక్ చేయాలి.
మే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పీజీసెట్ పరీక్షలు జరిగాయి. 19వేల 1118 మంది దరఖాస్తు చేసుకోగా 16వేల 406 మంది హాజరయ్యారు. మొత్తం 15,020 మంది (91.55%) క్వాలిఫై అయ్యారు.
Also Read: TG ECET-2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్ లోడ్ ఇలా..
