Singer Sunitha : ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ కాదు.. ఫెమినిజం అంటే.. సిగరెట్ లైటర్ ఫ్రీడమా? సునీత సంచలన వ్యాఖ్యలు..
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత కొన్ని విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.(Singer Sunitha)
Singer Sunitha
Singer Sunitha : ఎన్నో ఏళ్లుగా సింగర్ గా సినీ పరిశ్రమలో ఉంటూ స్టార్ సింగర్ గా ఫేమ్ తెచ్చుకుంది సునీత. ఇప్పుడు కూడా సినిమాల్లో పాడుతూ ఈవెంట్స్, కాన్సర్ట్స్ నిర్వహిస్తూ బిజీగానే ఉంది సునీత. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత కొన్ని విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రిలీజ్ చేసారు.
ఈ ప్రోమోలో సునీత మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ మహిళలకు సేఫ్ కాదు. నేను ఇండస్ట్రీలో సక్సెస్ అయినా ఇదే మాట చెప్తాను. ఇక్కడ దోపిడీ ఉంది. చేతులు వెయ్యడం ఈ రోజుల్లో పెద్ద విషయమే కాదు. నేను అలాంటివి 18 ఏళ్ళు ఉన్నప్పుడే ఫేస్ చేశాను. ఇలాంటివాటికి అసలు ఎండ్ ఉండదు. ఇక్కడ ఒకరితో పెద్ద మనిషిలా బిహేవ్ చేసేవాళ్లు ఇంకొకరితో ఇంకోలా బిహేవ్ చేస్తారు. అమ్మాయిలు బట్టల విషయంలో నా బాడీ నా ఇష్టం అంటే అతని కళ్ళు అతని ఇష్టం. ఫెమినిజం అంటే ఏంటి? మగవాళ్ళు, ఆడవాళ్లు ఈక్వల్ కానే కారు. సిగరెట్ లైట్ ని టార్చ్ ఫర్ ఫ్రీడమ్ అనుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేసింది.
Also Read : Mahesh Babu : వారణాసి కంటే ముందే మీడియా ముందుకు మహేష్ బాబు.. ఎందుకంటే..?
దీంతో ప్రోమోలోనే ఈ రేంజ్ వ్యాఖ్యలు ఉన్నాయంటే ఇక ఫుల్ ఇంటర్వ్యూలో ఇంకెన్ని సంచలన వ్యాఖ్యలు చేసిందో సునీత అని ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు.
Singer #Sunitha On What It Takes For Women To Succeed In The Industry.
A Very Interesting Conversation. Full Interview Tomorrow! pic.twitter.com/TXuH42nj4u
— Gulte (@GulteOfficial) June 23, 2026
