Rashmika Mandanna : ఏం మాట్లాడాలన్నా భయమేస్తుంది.. భయంతో.. బాలీవుడ్లో రష్మిక వ్యాఖ్యలు..
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోలింగ్స్ గురించి రష్మిక మాట్లాడుతూ.. (Rashmika Mandanna)
Rashmika Mandanna
Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకొని నెల రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు సెలబ్రేట్ చేసుకొని రోజూ వార్తల్లో నిలిచారు ఈ జంట. ఇటీవలే రష్మిక నటించిన బాలీవుడ్ సినిమా కాక్ టైల్ 2 రిలీజ్ అయింది. ఈ సినిమాలో రష్మిక కాస్త బోల్డ్ గానే నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోలింగ్స్ గురించి రష్మిక మాట్లాడుతూ.. ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది. మనం ఏం మాట్లాడినా అది వేరే విధంగా వెళ్తుంది. నేను అనని విషయాలను కూడా అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. మన గురించి ఎలాంటి రూమర్ వస్తుందో అని రోజూ భయంతో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియా మంచిదే కానీ దాన్ని కొందరు తప్పుగా వాడుతున్నారు అని తెలిపింది.
