Ram Charan: నా గురించి నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు.. తల్లికి చెర్రీ విషెష్!
తల్లి, బిడ్డల బంధం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అది వెలకట్టలేని బంధం. అలాగే బిడ్డ గురించి తల్లికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచిన తల్లి బిడ్డకి

Ram Charan
Ram Charan: తల్లి, బిడ్డల బంధం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అది వెలకట్టలేని బంధం. అలాగే బిడ్డ గురించి తల్లికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచిన తల్లి బిడ్డకి సంబంధించి ప్రతి విషయాన్నీ గమనిస్తుంది. ఇక అబ్బాయిలైతే ఎప్పుడు అమ్మకూచిలానే పెరుగుతారు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ సైతం అమ్మ చాటు బిడ్డనే అని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. చాలాసార్లు ఈ విషయాన్ని చిరు బాహాటంగానే చెప్పుకొచ్చారు.
Thalaivar169: మరోసారి రజినీతో ఐష్.. రోబో లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందా?
కాగా, మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆచార్య సెట్స్ పై కొణిదెల సురేఖ ఉన్నప్పటి ఫొటోను పంచుకున్న రామ్ చరణ్.. తల్లికి భావోద్వేగ శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోలో సురేఖకు ఒకవైపున చిరంజీవి, మరోవైపు రామ్ చరణ్ ఉన్నారు.
Movie Releases: ప్చ్.. ఈ వారం కూడా సందడి లేని థియేటర్లు!
“నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను మరెవ్వరూ అర్థం చేసుకోలేరు.. హ్యాపీ బర్త్ డే మా” అంటూ ట్విట్టర్ లో రామ్ చరణ్ భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారగా మెగా అభిమానులు చరణ్ ట్వీట్ రీట్వీట్ చేస్తూ సురేఖకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఎంతో అపురూపంగా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాప్ అన్నా అంటూ అభిమానులు కూడా సురేఖకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
No one knows me like you do!!
Happy birthday maa?❤️!! pic.twitter.com/CEzqCsvsSZ— Ram Charan (@AlwaysRamCharan) February 18, 2022