The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను.....
The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
The Warrior: విజిల్ వేయిస్తున్న వారియర్.. ఎప్పుడంటే?
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను జూలై 1న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించడంతో, ఈ చిత్ర ట్రైలర్‌ను కూడా రెండు భాషల్లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్‌ను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
The warrior : రామ్ కోసం.. 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్..
అటు తమిళంలో ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ హీరో శివ కార్తికేయన్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోండగా, ఈ సినిమాను జూలై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్‌ను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
Mass Director #BoyapatiSreenu garu will launch the Massiest #TheWarriorrTrailer at the event tom @ 7:57 PM?
Prince @Siva_Kartikeyan will Unveil Tamil Trailer Digitally@RamSayz @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens @adityamusic @masterpieceoffl pic.twitter.com/uGB3Z6QKJb
— Srinivasaa Silver Screen (@SS_Screens) June 30, 2022