Brahmanandam : బుల్లితెరపై ‘బ్రహ్మానందం’… ఆలీతో కలిసి రచ్చ.. టీఆర్పీలు బద్దలవ్వడం ఖాయం

'ఆలీతో సరదాగా' అనే ప్రోగ్రాంలో ఆలీ యాంకర్ గా ఎంతో మంది గెస్ట్ లని తీసుకొచ్చారు. ఎంతో మంది సెలబ్రిటీల ఇంటర్వ్యూలు అద్భుతంగా సాగాయి ఈ షోలో. ఇప్పుడు త్వరలో బ్రహ్మానందాన్ని....

Brahmanandam : బుల్లితెరపై ‘బ్రహ్మానందం’… ఆలీతో కలిసి రచ్చ.. టీఆర్పీలు బద్దలవ్వడం ఖాయం

Brahmanandam

Brahmanandam :  మనందరం నవ్వడం కోసమే బ్రహ్మ ఆనందంలో ఉన్నప్పుడు ఓ మనిషిని పుట్టిస్తే అతనే బ్రహ్మానందం అయ్యాడేమో. తెలుగు వాళ్ళు చేసుకున్న పుణ్యం, తెలుగు సినీ పరిశ్రమ చేసుకున్న అదృష్టం బ్రహ్మానందం మనతో ఉండటం. తెర మీద కామెడీ ఎలా పండించాలి? సినిమా చూసి జనాలు ఎలా నవ్వాలి? దాని కోసం ఎన్నెన్ని పేజీలు రాయాలో అనుకునే రోజుల్లో ఆయన వచ్చి గతాన్ని మార్చేశాడు. తెరపైన కామెడీ కావాలంటే, జనాలు నవ్వాలంటే ఆయనొక్కడు కనపడితే చాలు పేజీల పేజీల స్క్రిప్టులు అక్కర్లేదు, ఆయన ఒక్క ఎక్స్ప్రెషన్ చాలు అని ప్రూవ్ చేశారు. 40 ఏళ్లకు పైగా మన అందర్నీ నవ్విస్తూ, మన ఆరోగ్యాల్ని కాపాడుతున్న బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే.

Anee Master : బిగ్ బాస్ 11 వారాలకి యాని మాస్టర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా??

సినిమాకి వెళ్తే ఆ సినిమాలో కచ్చితంగా బ్రహ్మానందం ఉండాలి అనుకుంటాం. కానీ ఇటీవల సినిమాలు చాలా తక్కువగా చేస్తున్నారు. ఆ బ్రహ్మానందం ఆనందంగా బుల్లితెరపైకి కూడా వచ్చి మన ఇంట్లో ఒకరైతే బాగుండు అని మనం చాలా సార్లు అనుకొనే ఉంటాము. గతంలో ఓ టీవీ ఛానల్ లో వచ్చిన కామెడీ షోకి ఆయన జడ్జిగా వ్యవహరించారు. ఆయన్ని తెరపై మనస్ఫూర్తిగా చూసి చాలా కాలమైంది. ఆయనకి, మనకి మధ్య ఏదో తెలియని గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు ఆ గ్యాప్ అంతటిని ఒకేసారి తగ్గించడానికి బ్రహ్మానందం మరోసారి బుల్లితెరపై మెరవనున్నారు.

Bigg Boss 5 : ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్ళే

‘ఆలీతో సరదాగా’ అనే ప్రోగ్రాంలో ఆలీ యాంకర్ గా ఎంతో మంది గెస్ట్ లని తీసుకొచ్చారు. ఎంతో మంది సెలబ్రిటీల ఇంటర్వ్యూలు అద్భుతంగా సాగాయి ఈ షోలో. ఇప్పుడు త్వరలో బ్రహ్మానందాన్ని కూడా తీసుకురాబోతున్నారు ఈ షోలో. ఒక్క కమెడియన్ ఉంటేనే మనం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాము. అలాంటిది ఇద్దరు లెజెండరీ కమెడియన్స్ ఒకేసారి బుల్లితెరపైన కనిపిస్తే టీఆర్పీలు బద్దలవ్వడం ఖాయం. ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో బ్రహ్మానందం గెస్ట్ గా వచ్చారు. ఆయనని ఇంటర్వ్యూ చేశారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ నుంచి 40 సెకండ్ల వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో బ్రహ్మానందం ఎంట్రీ అదిరిపోయింది. ఇక అలీ, బ్రహ్మానందం లు కలిసి డ్యాన్స్ చేస్తే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది.

NTR : నిన్న పెద్ద కొడుకు.. ఇవాళ చిన్న కొడుకు.. ఫారిన్‌లో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్

త్వరలోనే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనుంది. ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బ్రహ్మానందం గారి గురించి తెలియని విషయాలను ఎన్నింటినో ఈ షో ద్వారా తెలుసుకోవచ్చు అని ఆశిస్తున్నారు ప్రేక్షకులు.