Bigg Boss 5 : ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్ళే

హౌస్ లో కొన్ని దిష్టిబొమ్మలు, ఖాళీ కుండలు పెట్టారు. అందరూ తలో దిష్టి బొమ్మ దగ్గర నించున్నారు. కంటెస్టెంట్స్ నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల దిష్టిబొమ్మలకు కుండలు పెట్టి....

Bigg Boss 5 : ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్ళే

Bb5

Bigg Boss 5 :  వీకెండ్ ఎపిసోడ్ అయిపోవడంతో సరదాలు పోయి మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వడంతో నిన్న కంటెస్టెంట్స్ మధ్య మళ్ళీ గొడవలు జరిగాయి. ఇప్పటికే 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 12వ వారం నామినేషన్స్‌ కి తెరతీసింది. ప్రతి సారి నామినేషన్స్ ని కొత్తగా క్రియేట్ చేసే బిగ్ బాస్ ఈ సారి కూడా మరింత కొత్తగా నామినేషన్స్ ప్రక్రియని చేపట్టాడు.

NTR : నిన్న పెద్ద కొడుకు.. ఇవాళ చిన్న కొడుకు.. ఫారిన్‌లో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్

హౌస్ లో కొన్ని దిష్టిబొమ్మలు, ఖాళీ కుండలు పెట్టారు. అందరూ తలో దిష్టి బొమ్మ దగ్గర నించున్నారు. కంటెస్టెంట్స్ నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల దిష్టిబొమ్మలకు కుండలు పెట్టి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పి ఆ కుండలిని పగల గొట్టాలి. దీంతో కంటెస్టెంట్స్ అంతా తమ కోపాన్ని ఆ కుండలపై చూపించారు.

Sundeep Kishan : సందీప్‌కిషన్ పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్

మొదటగా రవి.. ఈ వారం కెప్టెన్ గా విధులు సరిగా నిర్వర్తించట్లేదంటూ సన్నీని, తర్వాత కాజల్‌ను నామినేట్‌ చేశాడు.
ప్రియాంక.. గతవారం గేమ్‌ పెద్దగా ఆడలేదంటూ షణ్నుని, షణ్నుతో పాటు సిరిని కూడా నామినేట్ చేసింది.
షణ్ను.. గత వారం కెప్టెన్‌గా పర్ఫెక్ట్‌గా లేడంటూ రవిని నామినేట్ చేశాడు. సిరి-షణ్ను ప్లాన్‌ చేసుకుని వచ్చారా? అన్న ప్రశ్న వీకెండ్‌లో కాకుండా డైరెక్ట్‌గా అడుగుంటే బాగుండేదని కాజల్‌ను నామినేట్‌ చేశాడు.
శ్రీరామ్.. నీవల్ల కెప్టెన్సీ కంటెండర్‌ కాలేకపోయానంటూ సన్నీని, ఎవిక్షన్‌ పాస్‌ యానీ మాస్టర్‌కు రాకుండా చేసి సన్నీకిచ్చిన కాజల్‌ని నామినేట్ చేశాడు. ఈ విషయంలో సన్నీకి, శ్రీరామ్ కి పెద్ద గొడవే అయింది. యానీ మాస్టర్‌ కాజల్ వల్లే ఎలిమినేట్‌ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సన్నీ.. హౌస్‌లో అందరికంటే ఫేక్‌ అంటూ రవిని నామినేట్ చేశాడు.
సిరి.. నా వెనకాల మాట్లాడొద్దంటూ పింకీని, రవిని నామినేట్‌ చేసింది.
కాజల్.. హౌస్ లో నాకు ఇష్టం లేని వ్యక్తి, జెన్యున్‌గా లేనిది రవి ఒక్కడే అంటూ రవిని, యానీ మాస్టర్‌ ఉసురు పోసుకుంటున్నామని అనడం నచ్చలేదని శ్రీరామ్‌ని నామినేట్ చేసింది.
చివర్లో కెప్టెన్‌ మానస్‌.. శ్రీరామ్‌, రవిని నామినేట్‌ చేశాడు.

Priyanka Chopra : స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విడాకులు??

ఇంటి సభ్యుల మధ్య గొడవలు, వాదోపవాదాలతో నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. కెప్టెన్‌ అయిన మానస్‌ తప్ప మిగిలిన ఇంటి సభ్యులు రవి, సన్నీ, శ్రీరామ్‌, కాజల్‌, సిరి, ప్రియాంక, షణ్ముఖ్‌లు ఈ వారం నామినేట్‌ అయ్యారు. మరి ఈ వీకెండ్ కి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.