Priyanka Chopra : స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విడాకులు??

తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన పేరు పక్కన తన భర్త పేరు తీసేయడం చర్చకు దారి తీసింది. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ముందు సోషల్ మీడియాలో తన పేరు పక్కన....

Priyanka Chopra : స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విడాకులు??

Priyanaka

Priyanka Chopra :  బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో హాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడికి చెక్కేసింది ప్రియాంక చోప్రా. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన ప్రియాంక అక్కడే ప్రముఖ పాప్‌సింగర్‌ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుంది. నిక్‌ జోనాస్‌ మ్యూజిక్‌ వీడియోల్లో కూడా కొన్నిసార్లు నటించింది ప్రియాంక. హాలీవుడ్ కి వెళ్లినా మన భారత సాంప్రదాయం మర్చిపోకుండా భర్త పేరుని తన పేరు వెనకాల పెట్టుకుంది. పెళ్లయిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాల్లో పేరును ‘ప్రియాంకా చోప్రా జోనాస్‌’గా మార్చుకుంది. ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి దీపావళికి పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

F3 Movie : వెంకటేష్‌కు రేచీకటి.. వరుణ్‌తేజ్‌కి నత్తి.. ‘ఎఫ్3’ కథ ఇదే..

తాజాగా ప్రియాంక తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తన పేరు పక్కన తన భర్త పేరు తీసేయడం చర్చకు దారి తీసింది. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ముందు సోషల్ మీడియాలో తన పేరు పక్కన భర్త పేరు తీసేసింది. ఆ తర్వాత విడాకులు ప్రకటించింది. దీంతో ప్రియాంక కూడా తన భర్త పేరు తీసేయడంతో అందరు ప్రియాంక, నిక్ లు కూడా విడిపోతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Rakul Preet Singh : రకుల్ పెళ్లి వాయిదా.. ఇప్పట్లో పెళ్లి చేసుకోను.. జస్ట్ ప్రేమ మాత్రమే

ప్రియాంక, నిక్‌జోనాస్‌ పెళ్లయి మూడేళ్ల వివాహబంధం హ్యాపీగా సాగిపోతుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. ఇటీవలే అమెరికాలో ఇల్లు కట్టుకొని భర్తతో సెటిలైపోయింది ప్రియాంకచోప్రా. తాజాగా వారిద్దరి వైవాహిక బంధంలో ఏమైనా అభిప్రాయభేదాలు వచ్చాయేమో అని అభిమానులు అనుకుంటున్నారు. ప్రియాంకని కామెంట్స్ లో దీని గురించి అడుగుతున్నారు అభిమానులు. ప్రియాంక నుంచి ఎటువంటి సమాధానం లేదు. మరి త్వరలో ప్రియాంక దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. అభిమానులు మాత్రం వీరిద్దరూ విడిపోకూడదనే కోరుకుంటున్నారు.