Sundeep Kishan : సందీప్‌కిషన్ పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్

సందీప్ జయాపజయాలు పట్టించుకోకుండా కొత్త కొత్త కథలని చేసుకుంటూ వెళ్తాడు. తాజాగా సందీప్ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసాడు. సందీప్ కిషన్ హీరోగా.......

Sundeep Kishan : సందీప్‌కిషన్ పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్

Sundeep

Sundeep Kishan :  ఇప్పుడున్న యువ హీరోల్లో బాగా ఎనర్జిటిక్ గా ఉండే హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ జయాపజయాలు పట్టించుకోకుండా కొత్త కొత్త కథలని చేసుకుంటూ వెళ్తాడు. తాజాగా సందీప్ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసాడు. సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయ‌కోడి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్, క‌ర‌ణ్ సీ ప్రొడ‌క్ష‌న్స్ కలిసి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ అయ్యేలా పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Priyanka Chopra : స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా విడాకులు??

ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో, మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ సినిమాలతోనే తెలుగు వాళ్ళకి బాగా నచ్చేసి ఇటీవలే ‘ఉప్పెన’ సినిమాతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువయ్యారు. మరో సారి తెలుగులో డైరెక్ట్ గా చేయబోతున్నారు ఈ సినిమాతో. అయితే ఈ సినిమాలో సందీప్ కి విలన్ గా ఓ స్టార్ డైరెక్టర్ ని తీసుకున్నట్టు సమాచారం.

F3 Movie : వెంకటేష్‌కు రేచీకటి.. వరుణ్‌తేజ్‌కి నత్తి.. ‘ఎఫ్3’ కథ ఇదే..

ఘ‌ర్ష‌ణ‌, ఏమాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు, సాహ‌సం శ్వాస‌గా సాగిపో, కనులు కనులను దోచాయంటే లాంటి ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలతో తెలుగు, త‌మిళ‌, మలయాళ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న స్టార్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్. ఈయన కేవలం దర్శకత్వమే కాకుండా యాక్టర్ గా చాలా సినిమాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో పూర్తి స్థాయి క్యారెక్టర్స్ కూడా చేసి మెప్పించారు. ఈ స్టార్ డైరెక్ట‌ర్ సందీప్ సినిమాలో కీల‌క‌పాత్ర‌లో నటించనున్నాడు. అయితే ఇది విలన్ పాత్రే అని సమాచారం.

Bigg Boss Priya : ప్రియా కూతురి పెళ్ళిలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి

తాజాగా ఈ సినిమా నుంచి గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. బేడీలతో ఉన్న చేతి నుంచి రక్తం కారుతున్నట్టు ఈ పోస్టర్ ఉంది. ఈ సినిమాకి మైఖేల్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాని గట్టిగానే ప్లాన్ చేసారని తెలుస్తుంది.