Brahmanandam : బ్రహ్మానందం ఇంట మొదలైన పెళ్లి సందడి.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమారుడు సిద్దార్థ్.. డాక్టర్ ఐశ్వర్యను వివాహామాడనున్నాడు.
Brahmanandam- CM KCR : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమారుడు సిద్దార్థ్.. డాక్టర్ ఐశ్వర్యను వివాహామాడనున్నాడు. ఇటీవలే వీరి నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లికి మూహూర్తాన్ని ఫిక్స్ చేశారు. అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో శనివారం ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Veera Simha Reddy : వీరసింహుని విజయోత్సవం.. ఏపీలోని ఆ థియేటర్లో 200 డేస్ రన్ కంప్లీట్
హైదరాబాద్‌లో జరగనున్న తన చిన్న కొడుకు సిద్ధార్థ్ వివాహానికి రావాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కుటుంబ సభ్యులతో కలిసి బ్రహ్మానందం ఆహ్వానించారు. పెళ్లి పత్రిక అందజేశారు. అలాగే తాను స్వయంగా వేసిన తిరుమల శ్రీవారి డ్రాయింగ్‌ను కానుకగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రహ్మానందం కుటుంబంతో కాసేపు సీఎం ముచ్చటించారు. ముఖ్యమంత్రిని కలుసుకున్న వారిలో బ్రహ్మానందంతో పాటు ఆయన సతీమణి, పెద్ద కొడుకు గౌతమ్ లు ఉన్నారు.
బ్రహ్మానందానికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు గౌతమ్ ‘పల్లకిలో పెళ్లికూతురు’ చిత్రంలో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆతరువాత పలు సినిమాల్లో నటించారు. ఆయనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక చిన్న కొడుకు విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కమెడియన్‌గానే కాకుండా బ్రహ్మానందం మంచి ఆర్టిస్టు అన్న సంగతి తెలిసిందే. పెన్సిల్ డ్రాయింగ్ వేయడంలోనూ ఆయన మేటి. లాక్ డౌన్ సమయంలో ఆయన ఎన్నో డ్రాయింగ్స్ వేశారు. వాటిని తన సన్నిహితులు, సినీ ప్రముఖులకు బహుమతులుగా అందజేశారు. తాజాగా తిరుమల శ్రీవారి డ్రాయింగ్ వేసి సీఎం కేసీఆర్‌కు అందించారు.