Veera Simha Reddy : వీర‌సింహుని విజ‌యోత్స‌వం.. ఏపీలోని ఆ థియేట‌ర్‌లో 200 డేస్ ర‌న్ కంప్లీట్

నంద‌మూరి బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్, హానీరోజ్ హీరోయిన్స్ గా న‌టించిన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

Veera Simha Reddy : వీర‌సింహుని విజ‌యోత్స‌వం.. ఏపీలోని ఆ థియేట‌ర్‌లో 200 డేస్ ర‌న్ కంప్లీట్

Veera simha reddy rare record

Updated On : July 29, 2023 / 5:43 PM IST

Veera Simha Reddy Achieves another Milestone : నంద‌మూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా, శృతి హాసన్(Shruthi Hassan), హానీరోజ్(Honey Rose) హీరోయిన్స్ గా న‌టించిన చిత్రం వీరసింహారెడ్డి(VeeraSimha Reddy). గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. యాక్షన్, మాస్, సిస్టర్ సెంటిమెంట్స్‌తో అభిమానుల‌ను అల‌రించి భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

థియేట‌ర్ల వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబ‌ట్టింది. తాజాగా ఈ చిత్రం ఓ ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. ఓ థియేట‌ర్‌లో 200 రోజులు ప‌రుగును పూర్తి చేసుకుంది. జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఏప్రిల్ 21తో 100 రోజుల‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ శ‌క్ర‌వారంతో 200 రోజుల ప‌రుగును పూర్తి చేసుకుంది. క‌ర్నూల్‌ అలూరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ థియేట‌ర్‌లో ఈ మైలురాయిని చేరుకుంది.

Sanjay Dutt : ఆంటోని దాస్‌గా సంజ‌య్ ద‌త్‌.. స్పెషల్‌ వీడియో.. విజ‌య్‌కు త‌గ్గ విల‌నే.. గూస్‌బంప్స్‌..

ఒక‌ప్పుడు సినిమాలు 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు ఆడేవి. త‌మ అభిమాన న‌టుడి సినిమాలు 100 రోజులు ఆడాయ్‌ అంటూ గ‌ర్వంగా చెప్పుకునేవారు. అయితే.. గ‌త 10, 15 సంవ‌త్స‌రాలుగా ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఓ సినిమా మూడు వారాలు ఆడిదంటేనే చాలా గొప్ప‌గా చెప్పుకోవాల్సిందే. అలాంటిది బాల‌య్య న‌టించిన వీర‌సింహారెడ్డి ఓ థియేట‌ర్‌లో ఏకంగా 200 రోజులు ప‌రుగును పూర్తి చేసుకోవ‌డం విశేషం అని చెప్ప‌వ‌చ్చు.

Rajinikanth : కావ్య బాధ‌ప‌డుతుంటే చూడ‌లేక‌పోతున్నా.. మార‌న్ వెంట‌నే ఈ ప‌ని చేయండి

ఇదిలా ఉంటే.. బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘లెజెండ్’ సినిమా క‌డ‌ప, క‌ర్నూలు జిల్లాల్లో 400 రోజుల‌కు పైగా ఆడింది.