Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

బిగ్ బాస్ ఇంట్లో ఐదవ వారం కూడా ముగిసింది. ముందుగా అనుకున్నట్లుగానే గ్లాస్ హౌజ్ లో గ్లామర్ డాల్ హమీదాను బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ చేసేశాడు. నవరాత్రి స్పెషల్ గా మొదలైన ఎపిసోడ్ లో..

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

Big Boss 5

Big Boss 5: బిగ్ బాస్ ఇంట్లో ఐదవ వారం కూడా ముగిసింది. ముందుగా అనుకున్నట్లుగానే గ్లాస్ హౌజ్ లో గ్లామర్ డాల్ హమీదాను బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ చేసేశాడు. నవరాత్రి స్పెషల్ గా మొదలైన ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ కు ఢోకా లేకుండా చూసుకున్న బిగ్ బాస్ ఇందు కోసం సింగర్ మంగ్లీ, హీరోయిన్ హెబ్బాపటేల్, హైపర్ ఆదిలతో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ హీరో హీరోయిన్లు అఖిల్, పూజహెగ్డేలను కూడా వాడేశాడు. ఎంటర్ టైన్మెంట్ ఎంత ఉన్నా ఆదివారం అంటే ఎలిమినేషన్ డే కూడా కావడంతో ఈ వారం హమీదాను ఇంటి నుండి బయటకి పంపేశారు.

Big Boss 5: ఒకవైపు ఫుల్‌ప్యాక్ ఎంటర్టైన్మెంట్.. మరోవైపు ఎలిమినేషన్ ఎమోషన్!

హమీదా ఈ వారం ఎలిమినేట్ అవుతుందని రెండు రోజుల క్రితమే లీకవగా అనుకున్నట్లుగానే ఆమెనే ఎలిమినేట్ అయింది. ముందుగా విశ్వ, జెస్సీ, సన్నీ డేంజర్‌ జోన్‌లో ఉన్నారని ప్రచారం జరగగా చివరికి హమీదా బయటకి వచ్చేసింది. అయితే.. హమీదా ఎలిమినేషన్ తో శ్రీరామచంద్ర పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. గత నాలుగు వారాలుగా శ్రీరామ్ హమీదా వెంటే ఉంటున్నాడు. ఫ్లైయింగ్ కిస్సుల నుండి మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఈ మధ్యనే అర్ధరాత్రి హగ్గులు.. ముద్దుల వరకు వచ్చింది.

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

శ్రీరామ్-హమీదాల జంటకి కూడా బిగ్ బాస్ ప్రేక్షకులలో కొందరు ఫ్యాన్స్ అయ్యారు. అయితే, ఇప్పుడు హమీదా ఎలిమినేట్ కావడంతో శ్రీరామ్ నెక్స్ట్ గేమ్ ఎలా ఉండబోతుందన్నది బిగ్ బాస్ అభిమానులకు చర్చగా మారింది. హమీదా ఇంటిని వీడుతుంటే శ్రీరామ్ తల్లడిల్లిపోయాడు. నిజానికి ఈ సీజన్ లో ఇంట్లో జంటలే తక్కువగా ఉంటే.. అందులో హమీదా-శ్రీరామ్ జంట చుట్టే కెమెరాలు తిరుగుతూ వచ్చాయి. కానీ.. ఇప్పుడు ఆ జంటను కూడా విడగొట్టేశారు. దీంతో సోషల్ మీడియాలో ఉన్న ఒక్క జంటను కూడా విడదీశారని కామెంట్లు, మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి.