Building Collapse : చూస్తుండగానే కుప్పకూలిన భవనం.. వైరల్ వీడియో

అందరు చూస్తుండగానే భవనం కుప్పకూలి పోయింది. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.

Building Collapse : చూస్తుండగానే కుప్పకూలిన భవనం.. వైరల్ వీడియో

Building Collapse

Building Collapse : కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. భవనం ఓ వైపుకు వంగిపోవడంతో స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి భవనంలోని వారిని బయటకు తరలించారు.

Read More : WhatsApp : ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదట.. ఎప్పటినుంచో తెలుసా?

అందరు బయటకు వచ్చిన కొద్దీ సేపటికే ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. భవనం భూనాది కుంగిపోవడం వల్లనే ఇది జరిగినట్లు తెలిపారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతోందని, భవనం కూలడంతో నిర్వాసితులైన వారిని పునరావాస కేంద్రానికి తరలించామని తెలిపారు.

Read More :  ప్రశాంత్ కిషోర్ ఇంటి అడ్రస్ మారింది..ఎందుకు ? ఏ పార్టీ కోసం ?