Naxal hotbed Sukma : నక్సల్స్ ఖిల్లా నుంచి యూకేకు…రియా ఫిలిప్ విజయగాథ

నక్సల్స్ ఖిల్లా నుంచి ఓ అమ్మాయి యూకేకు వలస వెళ్లిన యువతి రియా ఫిలిప్ విజయగాథ తాజాగా వెలుగుచూసింది. మారుమూల వెనుకబడిన నక్సల్స్ పీడిత గ్రామానికి చెందిన యువతి రియా ఫిలిప్ లండన్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా రూ.21లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించి స్ఫూర్తిగా నిలిచింది....

Naxal hotbed Sukma : నక్సల్స్ ఖిల్లా నుంచి యూకేకు…రియా ఫిలిప్ విజయగాథ

Bus driver’s daughter

Naxal hotbed Sukma : నక్సల్స్ ఖిల్లా నుంచి ఓ అమ్మాయి యూకేకు వలస వెళ్లిన యువతి రియా ఫిలిప్ విజయగాథ తాజాగా వెలుగుచూసింది. మారుమూల వెనుకబడిన నక్సల్స్ పీడిత గ్రామానికి చెందిన యువతి రియా ఫిలిప్ లండన్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా రూ.21లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించి స్ఫూర్తిగా నిలిచింది.

Delta Airlines Plane : డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్‌లో మంటలు, ఒకరికి గాయాలు

నక్సలైట్ల ఖిల్లాగా పేరొందిన ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా డోర్నపాల్ గ్రామానికి చెందిన రియా ఫిలిప్ రిటైర్డు బస్సు డ్రైవర్ కుమార్తె. మారుమూల నక్సల్స్ ప్రభావిత గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన రియా పట్టుదలతో విజయం సాధించింది. (Bus driver’s daughter) రియా తల్లి షోలీ ఫిలిప్ ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు కాగా, ఆమె తండ్రి రితేష్ ఫిలిప్ అదే పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్, ముగ్గురు సైనికుల మృతి

గతంలో రియా కుటుంబం దుబ్బతోట గ్రామంలో నివాసం ఉండేవారు. అయితే ఆ తర్వాత నక్సల్స్ భయంతో దోర్నపాల్ కు తరలివెళ్లారు. (Naxal hotbed Sukma) హైస్కూల్ విద్యను జగదల్ పూర్ నగరంలో పూర్తిచేసిన రియా బెంగళూరు నగరంలో నర్సింగ్ కోర్సు అభ్యసించింది. అనంతరం ముంబయి నగరంలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో రెండేళ్లపాటు పనిచేసింది.

Electric Shock : విద్యుత్ షాక్ తో ఇద్దరు కూలీలు, రక్షించేందుకు వెళ్లిన అంగన్ వాడీ ఆయా మృతి

రియాకు లండన్ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. రియా యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లడానికి రూ.3 లక్షల కోసం తమ ఇంటిని తనఖా పెట్టవలసి వచ్చిందని ఆమె తండ్రి రితేష్ ఫిలిప్ చెప్పారు. రూ.21 లక్షల వార్షిక వేతనంతో యూకేలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన రియా వెనుకబడిన ప్రాంతాల మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. రియా సాధించిన విజయం ఆమె బంధువులకు కూడా ఆనందాన్ని కలిగించింది.